NPS Vatsalya Scheme: NPS వాత్సల్య మైనర్ల కోసం రూపొందించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. 18 ఏళ్ల లోపు పిల్లల ఆర్థిక భవిష్యత్ కోసం తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదికి కనిష్టంగా 1,000 రూపాయలతో పెట్టుబడి స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో పెద్ద మొత్తంలో ఫండ్ నిర్మించుకోవచ్చు. రెగ్యులర్ సేవింగ్స్, మార్కెట్ లింక్డ్ రిటర్న్స్, 50,000 రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు ఈ స్కీమ్ ప్రత్యేకతలు. ఈజీ చెల్లింపులు, విద్య, వైద్య అవసరాల కోసం పాక్షికంగా విత్ డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. NPS వాత్సల్య ప్రతి అకౌంట్ కు శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) జారీ చేస్తారు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ అకౌంట్ ను కొనసాగించవచ్చు, ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ లో ఏడాదికి కనీసం 1,000 రూపాయలు చందా చెల్లించాలి. గరిష్ట పరిమితి లేదు. తల్లిదండ్రులు లేదా గార్డియన్ తమకు అనుకూలంగా నెలవారీ, మూడు నెలలు లేదా ఏడాదికి ఒకసారి కంట్రిబ్యూషన్ చెల్లించవచ్చు. పాత పన్ను విధానంలో తల్లిదండ్రులు సెక్షన్ 80CCD(1B) కింద 50,000 రూపాయలు వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఈ పన్ను మినహాయింపు వారి అకౌంట్ కోసం లేదా పిల్లల అకౌంట్ లేదా ఇద్దరి మీద ఉపయోగించుకోవచ్చు.
మీ బిడ్డ పుట్టిన దగ్గరి నుంచి ఈ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ మెంట్‌ను కొనసాగిస్తే.. డిపాజిట్ మొత్తం 7.2 లక్షలు అవుతుంది. దీనిపై కాంపౌండింగ్ బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సగటున 14 శాతం రాబడి అంచనా వేసుకున్నా రాబడి బాగానే ఉంటుంది. స్టార్టింగ్ లో వృద్ధి తక్కువగా కనిపించినా.. 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత స్పీడందుకుంటుంది. ఇక 60 సంవత్సరాల తర్వాత కార్పస్ 11.5 కోట్లకు చేరుకుంటుంది. మీరు చేసే 7.2 లక్షల డిపాజిట్ మొత్తం ఏకంగా 11.57 కోట్లుగా మారుతుంది. ఒకవేళ మీరు 60 ఏళ్లు వద్దనుకుంటే 30 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టువచ్చు. నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. 30 ఏళ్లు తర్వాత మీ పిల్లల పేరుపై 62 లక్షలు వస్తుంది. ఇందులో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలనుకంటే.. 37 లక్షలకు పైగా ఒకసారి చేతికి వస్తాయి. మిగతా మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు కూడా నెలకు 12 వేల రూపాయలకు పైగా పొందొచ్చు.
NPS వాత్సల్య స్కీమ్ లో రెండు పెట్టుబడి మార్గాలున్నాయి.
1.ఆటో చాయిస్ (లైఫ్ సైకిల్ బేస్డ్)
ఈ విధానంలో పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ ఎక్స్‌పోజర్ దానంతట అదే తగ్గుతుంది.
2.యాక్టివ్ ఛాయిస్ (కస్టమ్ అలొకేషన్)
ఈ విధానం లాంగ్ టర్మ్ గోల్స్ ఆధారంగా నష్టభయం, రాబడులను సర్దుబాటుకు వీలు కల్పిస్తుంది.
NPS వాత్సల్య స్కీమ్ లో.. పిల్లల విద్య, వైద్యం లేదా ఎమర్జెన్సీ అవసరాల కోసం కొంతమేర విత్ డ్రా చేసుకోవచ్చు. చందాదారుడి వాటా మొత్తం నుంచి 25 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ తర్వాతే అనుమతిస్తారు. 18 ఏళ్లలోపు గరిష్టంగా మూడు సార్లు ఇలా విత్ డ్రా చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్, వైద్య చికిత్స, వైకల్యం ఖర్చుల కోసం కొంత మేర విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే విత్ డ్రాలపై NPS రూల్స్ ఫాలో అవ్వాలి.
18 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఎన్పీఎస్ వాత్సల్య అకౌంట్ ను కొనసాగించవచ్చు. దీనిని జనరల్ NPS టైర్-1 అకౌంట్ గా చేంజ్ చేస్తారు. అయితే చందాదారుడు 3 నెలల్లోపు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ పై అతడికి పూర్తి హక్కులు వస్తాయి.
మధ్యలోనే ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే… మొత్తం కార్పస్ 2.5 లక్షల వరకు ఉంటే పూర్తి మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. దీనిపై ట్యాక్స్ పడదు. కార్పస్ 2.5 లక్షలు దాటితే 60 శాతం వరకు ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై ట్యాక్స్ పడదు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. యాన్యుటీ పై వచ్చే పెన్షన్ ఆదాయం.. స్లాబ్ ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. మైనర్ మరణించిన సందర్భంలో.. ఆ మొత్తాన్ని గార్డియన్ లేదా నామినీకి చెల్లిస్తారు. దీనిపై NPS రూల్స్ ప్రకారం పన్ను విధిస్తారు. ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ ముఖ్య ఉద్దేశం పిల్లల చిన్న వయస్సులోనే పెట్టుబడి పెడితే, లాంగ్ టర్మ్ లో చక్ర వడ్డీతో భారీ మొత్తంలో తిరిగి వస్తాయి.
Also Read: మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. పూర్తి వివరాలు ఇలా!