E-Paper
Advertisement

పసిడి ప్రియులకు బంపర్ ఆఫర్.. రాత్రికి రాత్రే కుప్పకూలిన ధరలు.. తులం బంగారంపై ఏకంగా..!

పసిడి ప్రియులకు బంపర్ ఆఫర్.. రాత్రికి రాత్రే కుప్పకూలిన ధరలు.. తులం బంగారంపై ఏకంగా..!
Advertisement

Gold Rate Dropped: నిన్నటి వరకు రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడి ధరలు, నేడు ఒక్కసారిగా కుప్పకూలడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా, మన దేశంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిన పసిడి, నేడు ఊరటనిచ్చేలా కిందకు దిగిరావడంతో నగల ప్రియులు, పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతేకాకుండా పసిడి ప్రియులు ఇదే సరైన సమయంగా భావించి జ్యువెలరీ షాపుల వైపు అడుగులు వేస్తున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు ఒక్కసారిగా పసిడి ధరలు కుప్పకూలాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,820 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,000 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,340 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,000 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
హమ్మయ్య.. బంగారం ధరలతో పాటు నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద ఉండగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు కేజీ సిల్వర్ పై రూ. 5,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ రూ. 2,55,000 వద్ద పలుకుతోంది.

Also Read: విమానయాన సంస్థలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీల్లో 25% తగ్గింపు!

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×