Dacoit Movie : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవ్, యాక్షన్, ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా వంటి డిఫరెంట్ స్టోరీలతో సినిమాలను చేస్తుంటాడు.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు అడివి శేషు.. గతంలో ఈయన నటించిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ స్టోరీ తో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీనే డెకాయిట్. ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఫ్రీ బుకింగ్స్ ఓవర్సీస్ లో భారీగా జరిగినట్లు తెలుస్తుంది.. మరి ఎన్ని కోట్ల టార్గెట్ తో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..
డెకాయిట్ మూవీ ఓవర్సీస్ హక్కులను మోక్ష మూవీస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రీమియర్స్‌తో పాటు సినిమా ప్రదర్శనకు ఈ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు తగినట్లుగానే మూవీకి రెస్పాన్స్ కూడా మంచిగానే వస్తుంది. థియేటర్లలోకి సినిమా ఏప్రిల్ 10వ తారీఖున రాబోతుంది కాబట్టి ఒకరోజు ముందుగా ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఓవర్సీస్ లో ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రీమియర్ షో పడుతుంది. ఇప్పటికే హార్ట్ కేకు లాగా సినిమా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికాలో 342 సెంటర్స్‌లో 738 షోలకు గాను ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌లో 13456 టికెట్లు సేల్ అయ్యినట్లు తెలుస్తుంది.. దీంతో దాదాపుగా రెండు కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ వచ్చినట్లు తెలుస్తుంది..
Also Read : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ప్లేస్ లోకి వచ్చేది ఈమెనేనా..?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి డెకాయిట్ మూవీకి 70 కోట్ల వరకు బడ్జెట్ అయ్యినట్లు తెలుస్తుంది. ప్రమోషనల్ కార్యక్రమాలకు, అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి ఎక్కువగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.. ఈ మూవీ ప్రీ బిజినెస్ విషయానికొస్తే.. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు, అంతేకాదు ఓవర్సీస్‌లో 6.5 కోట్లు.. మొత్తం కలిపి 30 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా 35 నుంచి 40 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాలి.. మరి ఇవాళ పడబోతున్న ప్రీమియర్ షోలతో ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుందో తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అందులోనూ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో కొత్తగా కనిపిస్తుంది.. మరి మూవీ ఏమాత్రం బస్సులను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.