PAN Card Misuse: భారతీయ పౌరులకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ మొదలు కొని ఆర్థిక సంబంధ అంశాలన్నింటికీ, తప్పకుండా పాన్ కార్డు కావాలి. అయితే, కొన్నిసార్లు ఇంత ముఖ్యమైన పాన్ కార్డును కొంత మంది దుండగులు మిస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు పొందడానికి సైబర్ నేరగాళ్లు ఇతరుల పాన్ కార్డులను ఉపయోగించిన సందర్భాలున్నాయి. మీ పాన్ నంబర్ మిస్ యూజ్ చేయబడుతుందని అనుమానం కలిగినా, లేదంటే మిస్ యూజ్ అవుతున్నా.. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
పాన్ కార్డు మిస్ యూజ్ అవుతుందని తెలుసుకోవడం ఎలా?
⦿ మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులతో సహా మీ ఫైనాన్సియల్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాయి. మీకు తెలియని లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయేమో చెక్ చేస్తూ ఉండాలి.
⦿ CIBIL లేదంటే ఇతర క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ రిపోర్టును తీసుకుని పరిశీలించాలి.
⦿ మీరు ఏదైనా అనుమానాస్పద లేదంటే అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత బ్యాంక్ లేదంటే ఫైనాన్షియల్ సంస్థను సంప్రదించండి.
⦿ మీ ఇన్ కమ్ టాక్స్ అకౌంట్ ను కూడా తనిఖీ చేయండి. ఏవైనా లోపాలు లేదంటే అన్ అఫీషియల్ మార్పులు జరిగాయేమో పరిశీలించండి.
⦿ మీకు తెలియని లావాదేవీలు జరిగితే ఫారమ్ 26AS వివరాలను కూడా చెక్ చేయడం మంచిది.
మీ పాన్ కార్డు మిస్ యూజ్ అయితే ఏం చేయాలి?
⦿ మీ స్టేట్‌మెంట్లు, ఖాతాలు, ఆదాయపు పన్ను వివరాలను చెక్ చేసినప్పుడు ఏదైనా అనుమానాస్పద లావాదేవీలను గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంక్ లేదంటే ఫైనాన్షియల్ సంస్థకు సమాచారం ఇవ్వండి.
⦿ మీ పాన్ కార్డు దుర్వినియోగం అయినట్లు మీరు భావిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఈ ఫిర్యాదు మీకు మున్ముందు చట్టపరమైన ఇబ్బందు నుంచి కాపాడుతుంది.
⦿ మీ పాన్ కార్డు మిస్ యూజ్ అయితే ఆదాయపు పన్ను శాఖను సంప్రదించడంతో పాటు సమాచారం ఇవ్వాలి.
Read Also: ఆధార్ నుంచి ఐటీఆర్ వరకు.. వెంటనే ఈ పనులు చేసేయండి!
ఆన్ లైన్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలి?
⦿ మీ పాన్ కార్డు మిస్ యూజ్ అయితే TIN NSDL వెబ్ సైట్ కు వెళ్లాలి.
⦿ హోమ్ పేజీలో కస్టమర్ కేర్ విభాగంలోకి వెళ్లాలి. ఇందులో డ్రాప్ డౌన్ మెనులోకి వెళ్లాలి.
⦿ డ్రాప్ డౌన్ మెను నుంచి ‘ఫిర్యాదులు/ ప్రశ్నలు’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే కంప్లైంట్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
⦿ కంప్లైంట్ ఫారమ్ లో అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి, సబ్ మిట్ చేయాలి.
Read Also: రూ. 2 లక్షలకే టాటా నానో ఈవీ, ఫీచర్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే!