Paytm: దేశంలో ప్రముఖ చెల్లింపుల సంస్థ అయిన పేటిఏం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ ఖాతాలకు ముందస్తు డబ్బు బదిలీ చేయకుండానే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను ఈజీగా చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే.. Paytm యాప్ వినియోగదారులు ట్రేడింగ్ చేసే సమయంలో వారి బ్యాంక్ ఖాతాలోని నిధులను ఉంచుకునే అవకాశం ఇస్తుంది. ఆ క్రమంలో వాస్తవమైన ట్రేడింగ్ సమయానికి ముందే నిధులు వారి బ్యాంక్ ఖాతాలోనే ఉంటే వాటిని ఉపయోగించుకుంటుంది.
ఈ క్రమంలో Paytm కొత్త ఆవిష్కరణ UPI ట్రేడింగ్ బ్లాక్ రూపంలో వెలుగులోకి వచ్చింది. దీంతో పేటీఎం యాప్ వినియోగదారులు ట్రేడింగ్ చేసే సమయంలో వారి బ్యాంక్ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో వాస్తవమైన ట్రేడింగ్ సమయానికి ముందే నిధులు వారి బ్యాంక్ ఖాతాలోనే ఉంటే వాటిని ఉపయోగించుకుంటుంది. ఇందులో ట్రేడింగ్ సమయంలో మాత్రమే నిధుల్ని ఉపయోగించుకునేలా ప్లాన్ చేశారు. Paytm ప్రకటన ప్రకారం UPI ట్రేడింగ్ బ్లాక్‌లు ఇప్పటికే ఎన్‌పీసీఐ (NPCI) నిబంధనలపై పనిచేస్తాయని వెల్లడించింది.
Paytm అందించే ఈ కొత్త సదుపాయం వినియోగదారులకు మరింత పారదర్శకతను, సురక్షితమైన లావాదేవీలను నిర్ధారిస్తుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఒక సమయబద్ధమైన ప్రక్రియ. అందుకే వినియోగదారులు ట్రేడింగ్ సమయంలో మాత్రమే వారి ఖాతాలలో డబ్బును ఉంచుకోవాలని భావిస్తారు. ఈ విధంగా వారు ట్రేడింగ్ తర్వాత కూడా తమ నిధులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఆ క్రమంలో ట్రేడింగ్ కోసం అవసరమైన మొత్తాన్ని మాత్రమే తీసుకుంటుంది. మిగిలిన మొత్తం మాత్రం వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో ఉంటుంది. ట్రేడింగ్ పూర్తయ్యాక, వినియోగదారులు వారి నిధులను Paytm యాప్ ద్వారా సులభంగా ట్రాక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
Read Also: UPI Payment Fee: యూజర్లకు అలర్ట్.. ఇకపై చెల్లింపులపై ఫైన్ విధించే ఛాన్స్
ఈ కొత్త ఫీచర్ తో Paytm UPI వినియోగదారులు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే సమయంలో ముందస్తుగా డబ్బు చెల్లించకుండానే వ్యాపారం చేసుకోవచ్చు. ఇది వారి ట్రేడింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. దీని ద్వారా వారు తమ బ్రోకర్ ఖాతాకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయకుండానే, వారి బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ చెల్లింపులు తీసుకునేందుకు ఛాన్సుంది.
ఈ క్రమంలో వినియోగదారులు తమ డబ్బును ముందుగానే బ్రోకరేజ్ ఖాతాలో ట్రాన్స్‌ఫర్ చేయకుండా ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. అదే సమయంలో వారి డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దీంతోపాటు వడ్డీని కూడా పొంందవచ్చు. యూపీఐ ట్రేడింగ్ బ్లాక్‌లకు మద్దతు ఇచ్చే ఈ కొత్త విధానం, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వ్యవస్థను మరింత సులభంగా, పారదర్శకంగా చేస్తుంది.
ప్రస్తుతం Paytm ఈ ఫీచర్ యాక్సిస్ బ్యాంక్ @ptaxis, యెస్ బ్యాంక్ @ptyes UPI హ్యాండిల్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఫీచర్ త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (@ptsbi), హెచ్‌డిఎఫ్సీ బ్యాంక్ (@pthdfc) UPI హ్యాండిల్స్‌కు విస్తరించే అవకాశం ఉంది.