BigTV English

Nagarjuna: ఇరానీ ఛాయ్, ధమ్ బిర్యానీ.. వీటి గురించి నాగ్ మాటల్లో..

Nagarjuna: ఇరానీ ఛాయ్, ధమ్ బిర్యానీ.. వీటి గురించి నాగ్ మాటల్లో..

Nagarjuna: తెలుగు సినిమాల షూటింగ్‌లు చాలావరకు తెలంగాణలో హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. పైగా తెలుగు సినీ పరిశ్రమ చాలావరకు హైదరాబాద్‌పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం కూడా చాలాసార్లు గర్వంగా చెప్పింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సినీ పరిశ్రమకు ఆశ్రయమిచ్చి ఆదరిస్తున్న ఈ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే బాధ్యత నటీనటులకు ఉందని చాలాసార్లు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందుకే తెలంగాణను ప్రమోట్ చేయడం కోసం ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. తాజాగా అందులో సీనియర్ హీరో నాగార్జున కూడా యాడ్ అయ్యారు. ఈ రాష్ట్రంలోని ప్రదేశాలు, ప్రత్యేకతల గురించి ఆయన మాటల్లో చెప్పారు.


ఆధ్మాత్మికమైన ప్రదేశాలు

‘‘చిన్నప్పటి నుండి చాలావరకు తెలంగాణలోనే తిరిగాను. ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. జోధేఘాట్ వాలీ, మిట్టే వాటర్‌ఫాల్స్, ఆదిలాబాద్ దగ్గర భోగతా వాటర్‌ఫాల్స్. ఇక దేవాలయాల విషయానికొస్తే వరంగల్ వేయి స్థంబాల గుడి, రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్‌ను యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఇది అందరూ చూడాలి. చాలా అందంగా బాగుంటుంది. యాదగిరిగుట్టకు అయితే చాలాసార్లు వెళ్లాను. చాలా భక్తిరసంగా, ఆధ్మాత్మికంగా ఉంటుంది. యాదగిరిగుట్టను కూడా అస్సలు మిస్ అవ్వకండి’’ అంటూ తెలంగాణలోని మర్చిపోలేని ప్రదేశాల గురించి చెప్పుకొచ్చారు నాగార్జున.


నోరూరించే వంటకాలు

ప్రదేశాల గురించి మాత్రమే కాదు.. తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా దొరికే, అందరూ మెచ్చే ఆహార పదార్థాల గురించి కూడా నాగార్జున మాట్లాడారు. అందులో ఆయన ఫేవరెట్స్ ఏంటో బయటపెట్టారు. ‘‘తెలంగాణ భోజనంలో నాకు నచ్చేది జొన్న రొట్టెలు, అంకాపూర్ చికెన్. స్నాక్స్‌లో సర్వపిండి చాలా ఇష్టం. ఇక ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్స్ గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ బిర్యానీ అనేది వరల్డ్ ఫేమస్. కేవలం ఇండియా ఫేమస్ కాదు. ఇవన్నీ మర్చిపోలేనివి. చెప్తుంటేనే నోరూరుతుంది’’ అంటూ అందరికీ నోరూరించే వంటకాల గురించి మరోసారి గుర్తుచేశారు నాగార్జున. అంతే కాకుండా తెలంగాణ ప్రజల గురించి కూడా ఆయన మాట్లాడారు.

Also Read: విడాకులపై క్లారిటీ.. భర్తతో కలిసి అలాంటి పని చేసిన ఐశ్వర్య.!

మంచి మనుషులు

‘‘నాకు తెలంగాణలో నచ్చే మరొక విషయం ఏంటంటే ఇక్కడి మనుషులు చాలా మంచివారు. వీళ్లు ప్రతీ భాషవారిని ఆహ్వానిస్తారు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందరూ తప్పకుండా వచ్చి తెలంగాణను ఎంజాయ్ చేయండి. జరూర్ ఆనా.. హమారే తెలంగాణ’’ అంటూ తెలంగాణ టూరిజంను సపోర్ట్ చేశారు నాగార్జున. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో విడుదల చేసిన ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. తెలంగాణనలో నిజంగానే చూడడానికి ఇన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయా అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి సినీ సెలబ్రిటీలు సైతం రాష్ట్ర టూరిజంను ఇలా ప్రమోట్ చేయడం బాగుందని ఫీలవుతున్నారు. ఇక నాగార్జున (Nagarjuna) కూడా హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ అనేది ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడే సెటిల్ అయ్యారు. ఆ స్టూడియోస్‌ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ షూటింగ్‌కు సౌకర్యంగా ఉండేలా మార్చారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×