BigTV English

PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280

PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280

PNB Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి బీటెక్‌, బీఈ, సీఎ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.


పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌(PNB), ఢిల్లీలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. మార్చి 24 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్, మేనేజర్(ఐటీ), సీనియర్ మేనేజర్(ఐటీ), మేనేజర్ డేటా సైంటిస్ట్, సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్), మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వెకెన్సీ వారీ ఉద్యోగాలు చూసినట్లయితే..

క్రెడిట్ ఆఫీసర్‌: 250
ఇండస్ట్రీ ఆఫీసర్‌: 75
మేనేజర్‌(ఐటీ): 05
సీనియర్ మేనేజర్‌(ఐటీ): 05
మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌: 03
సీనియర్ మేనేజర్‌(డేటా సైంటిస్ట్‌): 02
మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీ: 05
సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ: 05

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 2

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 24

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, సీఎ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. క్రెడిట్ ఆఫీసర్, ఇండస్ట్రీ ఆఫీసర్ ఉద్యోగాలకు నెలకు రూ. రూ.48,480 – రూ.85,920, మేనేజర్‌ (ఐటీ), మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌, మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు రూ.64,820 – 93,960, సీనియర్ మేనేజర్‌(ఐటీ), సీనియర్ మేనేజర్‌(డేటా సైంటిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలకు రూ.85,920 – 1,05,280 వేతనం లభిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారం ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

రాత పరీక్ష తేదీలు: 2025 మార్చి, మే

పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపుర్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్ బెంగాల్‌.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.pnbindia.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: CAREER FAIR: శుభవార్త.. మన ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద కెరీర్ ఫెయిర్.. 49 అగ్ర కంపెనీలు, 10,000 ఉద్యోగాలు

ముఖ్యమైనవి..

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 24

రాత పరీక్ష తేదీలు: 2025 మార్చి, మే లో ఉండొచ్చు.

Related News

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Intelligence Bureau: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 జాబ్స్.. రూ.69,100 జీతం.. లాస్ట్ డేట్?

Indian Navy: ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,10,000 వేతనం

Big Stories

×