దేశంలో సమాచార బట్వాడాలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ కీలక పాత్ర పోషిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 1.56 లక్షలకు పైగా పోస్టాఫీసులు ప్రజలకు పలు రకాల సేవలను అందిస్తున్నాయి. సాధారణ లెటర్ల నుంచి మొదలుకొని, సేవింగ్స్ ఖాతాలు, ప్రభుత్వ పథకాలకు వరకు రకరకాల సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పోస్టాఫీస్ సేవలు అందుబాటులో లేవు. ఇప్పటికే పోస్టల్ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రజలకు ఈ ఇబ్బందులను తొలగించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీస్ ప్రాంఛైజీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కేవలంరూ. 5 వేల పెట్టుబడితో పోస్టాఫీస్ ప్రాంచైజీ
ఉపాధిలేని యువత కేవలం రూ. 5 వేలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంచైజీని దక్కించుకోవచ్చు. పోస్టల్ సేవలకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పోస్టాఫీసులు ఓపెన్ చేయడం కుదరదు. అలాంటి సమయంలో ప్రాంచైజీ సాయంతో ఔట్ లెట్ లను ఓపెన్ చేసి, ప్రజలకు పోస్టల్ సర్వీసులు అందించవచ్చు. అయితే, పోస్టాఫీస్ కు సంబంధించి సంపాదన ఎంత వస్తుంది అనేది కచ్చితంగా చెప్పలేం. మీరు చేసే సర్వీసులను బట్టి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీ సమీపంలో పోస్టాఫీస్ లేకుంటే, మీ ప్రాంచైజీకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంటే ఎక్కువ లాభాలాను సాధించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నెలకు రూ. లక్ష వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో పోస్ట ఆఫీస్ ప్రాంచైజీ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీస్ ప్రాంచైజీ తీసుకునేందుకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్
⦿ భారతీయ పౌరులు అయి ఉండాలి.
⦿ వయసు 18 ఏండ్లు దాటి ఉండాలి.
⦿ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ నుంచి 8వ తరగతి పాసై ఉండాలి.
⦿ ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు.
⦿ పోస్టల్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రాంచైజీ ఇవ్వరు.
ఆన్ లైన్ వేదికగా ఓ ఫారమ్ ను పూర్తి చేసి సబ్ మిట్ చేయాలి. ఎంపికైన తర్వాత ఇండియన్ పోస్ట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ నుంచి వచ్చే ఆదాయం కమిషన్ బేసిస్ న ఉంటుంది. SC/ST వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, మహిళా దరఖాస్తుదారులు, ప్రభుత్వ పథకం కింద ఎంపికైన వారు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పోస్టాఫీస్ ప్రాంచైజీ పథకంతో లాభాలు
⦿పోస్టాఫీసు సర్వీసులు అందిస్తూ కమీషన్ పొందే అవకాశం ఉంటుంది.
⦿రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్‌కు రూ. 3, స్పీడ్ పోస్ట్ బుకింగ్‌కు రూ. 5 కమీషన్, రూ. 100- 200 మధ్య మనీ ఆర్డర్ల బుకింగ్‌పై రూ. 3.50 కమీషన్, రూ. 200 కంటే ఎక్కువ మనీ ఆర్డర్లకు రూ. 5 కమీషన్, రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ సేవలకు నెలకు రూ. 1000 అదనపు కమీషన్ పొందే అవకాశం ఉంటుంది. .
⦿పెరిగిన బుకింగ్‌లకు అదనంగా 20% కమిషన్ అందుబాటులో ఉంది. ఇతరత్రా బుకింగ్స్ ద్వారా కమిషన్ పొందే అవకాశం ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసుకోవడానికి, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవాలి ఈ అధికారిక లింక్ ను ఓపెన్ చేయండి. https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf
Read Also: ఇండియన్స్ ఇకపై ఈ దేశాల్లోనూ ఈజీగా UPI పేమెంట్స్ చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?