Pradhan Mantri Jan Dhan Yojana: దేశంలోని పేద ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే ఉద్దేశంతో 2014, ఆగస్టు 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన(PMJDY). వెనుకబడిన ప్రాంతాలు, గ్రాముల్లోని ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ఈ పథకంతో లాభాలు పొందారు. తమ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ల తో బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు బ్యాంక్ అకౌంట్ల సౌకర్యం అందించిన ఏకైక సంక్షేమ పథకం ఇది. ఈ పథకానికి ఇటీవలే పది సంవత్సరాలు పూర్తయ్యాయి.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన జాతీయ పథకంతో అణగారిన వర్గాలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పథకంలో చేరిన వారందరూ తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకోవడం కోసం బ్యాంక్ లో ఉచితంగా ఖాతాలు తెరిచారు. డిపాజిట్, చెల్లింపులు కోసం జన్ ధన్ అకౌంట్లు ఉపయోగపడుతన్నాయి. ఖాతాదారులకు ఈ అకౌంట్ల ద్వారా క్రెడిట్, బీమా మరియు పెన్షన్ సేవలు కూడా పొందవచ్చు. ఈ అకౌంట్లు ఎవరైనా ఏదైనా బ్యాంక్ లో తెరిచేందుకు బ్యాంక్ మిత్రను సంప్రదించవచ్చు.
దేశంలో ప్రస్తుతం ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలు మొత్తం 53.13 కోట్లకు పైగానే ఉన్నాయి. అందులో 35 కోట్ల అకౌంట్లు చిన్న పట్టణాల్లో నివసించే వారు కలిగి ఉన్నారు. 2011లో దేశంలోని 26 శాతం మహిళలకు బ్యాక్ అకౌంట్లు ఉన్నాయి. అయితే 2014 నుంచి ఈ పథకం అమలులోకి రావడంతో 2021 డేటా ప్రకారం.. 78 శాతం మహిళలక అకౌంట్లు ఉన్నాయి.
ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా ప్రయోజనాలు:
ఈ బ్యాంక్ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ సౌకర్యం కలిగి ఉండడం వల్ల ఇందులో కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు.
బ్యాంకింగ్ చేయని ప్రతి వ్యక్తికి ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవబడుతుంది
PMJDY ఖాతా డిపాజిట్లు చేసిన వారికి బ్యాంకులు వడ్డీ లాభాలు అందిస్తున్నాయి.
PMJDY ఖాతాదారునికి బ్యాంకు నుంచి రూపే డెబిట్ కార్డ్ అందించబడుతుంది.
రూపే డెబిట్ కార్డుపై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ. 2 లక్షల వరకు, సాధారణ బీమా రూ. 30 వేల వరకు వస్తుంది.
2024 ఆగస్టు వరకు 36.13 మందికి రూపే డెబిట్ కార్డులు జారీ చేయబడ్డాయి.
వీటికి తోడు అర్హత కలిగిన ఖాతాదారులు.. ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా రూ. 10,000 వరకు రుణం తీసుకోవచ్చు. అంటే అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నా పది వేలు రుణం పొందవచ్చు.
పైగా ఈ ప్రధాన జన్ ధన్ ఖాతాదారులు.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), మరియు మైక్రో యూనిట్ల అభివృద్ధి & రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్ (ముద్రా) పథకాలకు అర్హులు.
అయితే ఒకే బ్యాంకులో సాధారణ అకౌంట్ ఉన్నవారు కొంతమంది జన్ ధన్ అకౌంట్ ని కూడా కలిగిఉన్నారు. వీటిని గుర్తించి ప్రభుత్వం రెండు అకౌంట్లు ఒకే బ్యాంక్ లో ఉంటే వారి జన్ ధన్ అకౌంట్లను క్లోజ్ చేస్తోంది. అలా జన్ ధన్ అకౌంట్ కోల్పోయిన వారు రూ. 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశముంది. అంటే పై చెప్పిన లాభాలన్నీ వారు కోల్పోతారు.
Also Read: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం!