TDP to celebrate Naidu reaching 30-year milestone as Chief Minister on September 1: 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా..15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా..మూడు పదుల వయసులోనే ముఖ్యమంత్రిగా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో తిరుగులేని మహరాజులా వెలుగొందుతున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ 1 ఎంతో ప్రత్యేకం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక క్షణమో రోజో గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు లేకుంటే పెళ్లి రోజు అంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఫలానా రోజున తనకు కలిసివచ్చిన రోజు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది. అందుకే టీడీపీ శ్రేణులు 30 సంవత్సరాల వేడుకలు జరిపేందుకు సిద్ధం అవుతున్నారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లా చంద్రబాబు థర్టీ ఇయర్స్ పాలిటిక్స్ అని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
మెప్పించిన చంద్రబాబు
అంతకు ముందు చంద్రబాబును విమర్శించిన నోళ్లన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. మహానటుడు ఎన్టీఆర్ వలనే కాలేకపోయిన ప్రజాపాలన చంద్రబాబు జనాన్ని ఎలా మెప్పిస్తారని అనుకున్నారు. తర్వాత తెలిసింది. చంద్రబాబు పాలనా దక్షత.ఆయన విజనరీ.సాంకేతిక అంశాలపై ఆయనకు ఉన్న పట్టు అన్నీ చూసి అంతా ఆశ్చర్యపోయారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెండో పర్యాయం 1999లో జరిగిన ఎన్నికలలోనూ ప్రజాభిమానాన్ని పొందగలిగారు. రెండో పర్యాయం కూడా మెప్పించారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. వైఎస్ ప్రభంజనం ముందు తెలుగుదేశం పార్టీ నిలవలేకపోయింది. వైఎస్ తన సంక్షేమ పథకాలతో వరుసగా రెండు పర్యాయాలు అంటే 2004, 2009లోనూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడం..తర్వాత వైఎస్ హవాతో వైఎస్ జగన్ విభజిత ఆంధ్రాకు సీఎం కావడం తెలిసిందే.
జగన్ కు ఝలక్
రెండో సారి 175 సీట్ల అత్యధిక మెజారిటీతో మరోసారి సీఎం అవుతానని చెప్పిన జగన్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఝలక్ ఇచ్చారు. అందుకే ఈ సారి తెలివిగా ప్లాన్ చేశారు. అటు మోదీని, ఇటు పవన్ కళ్యాణ్ ని కలుపుకుని కూటమి ఏర్పాటు చేశారు. సీట్ల ఒప్పందంలోనూ ఎవరికీ ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్లారు. దేశంలోనే అత్యంత రాజకీయ అనుభవం కలిగిన నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు. తలచుకుంటే ఇండియా కూటమి ని కొలుపుకుని ప్రధాని అయ్యే అర్హత కూడా పొందేవారు. మొదట్లో చంద్రబాబును విభేదించిన మోదీకి ప్రస్తుతం చంద్రబాబే తనకు ఆసరా అయ్యారు. కేంద్రంలో చంద్రబాబు సహకారం లేకుంటే మోదీ సంకీర్ణ ప్రభుత్వం సైతం ఏర్పాటు చేయలేకపోయేవారు. అందుకే మోదీ చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా సందర్భాలలో బాబు సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తన జీవితంలో పెను మార్పు తీసుకు వచ్చిన సెప్టెంబర్ 1ని మర్చిపోరు. సెప్టెంబర్ 1 చంద్రబాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.