BigTV English
Advertisement

RBI Loan EMIs ATM Charges : తగ్గనున్న లోన్ ఈఎంఐలు.. పెరగనున్న ఏటిఎం ఛార్జీలు!

RBI Loan EMIs ATM Charges : తగ్గనున్న లోన్ ఈఎంఐలు.. పెరగనున్న ఏటిఎం ఛార్జీలు!

RBI Loan EMIs ATM Charges | బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న రుణగ్రహీతలకు శుభవార్త! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచిన ఆర్బీఐ.. ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించే ప్రణాళికలో ఉంది. ఇది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, కారు లోన్ల వంటి వాటికి ఈఎంఐలు (EMI) చెల్లించేవారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది.


కొత్తగా నియమితులైన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్వర్యంలో మొదటి ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల చర్చల తర్వాత, వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ఈ కమిటీ ప్రకటించనుంది. మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడం, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడం కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో, ఆర్‌బీఐ కూడా రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో, ఆర్బీఐకి ధరల పెరుగుదల గురించి ఆందోళన లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఆర్బీఐ రెపో రేటును (స్వల్పకాలిక రుణ రేటు) 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా స్థిరంగా ఉంచింది. కోవిడ్ కాలంలో (2020 మే) చివరిసారిగా రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ, తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం మందగించడంతో, రుణాలను చౌకగా అందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రుణగ్రహీతలపై ఈఎంఐల భారాన్ని తగ్గిస్తుంది.


ఏటీఎం నగదు ఉపసంహరణపై ఛార్జీలు పెరుగబోతున్నాయి
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆలోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసింది. అంతేకాకుండా, ఇతర బ్యాంకు ఏటీఎంల ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.

Also Read: బడ్జెట్ ప్రభావం.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆభరణాల ధరలు ఎంత తగ్గుతాయి?

ఛార్జీలు పెరగడానికి కారణాలు

ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా మరియు నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో ఏటీఎం ఆపరేటర్ల నిర్వహణ ఖర్చులను భరించడానికి మరియు ఏటీఎం సేవల సుస్థిరతకు ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

వినియోగదారులపై ప్రభావం

ఈ సిఫార్సులను ఆర్‌బీఐ ఆమోదిస్తే, వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల ద్వారా తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్‌బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నారు.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×