BigTV English

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

సాధారణంగా దినపత్రికల్లో బ్యాంకులు సకాలంలో రుణాలు చెల్లించని ఇళ్లను వేలం వేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ తరహా ప్రాపర్టీలను కొనుగోలు చేయవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఎందుకంటే ఈ తరహా ఇళ్లను కొనుగోలు చేస్తే చట్టపరంగా ఏమైనా సమస్యలు వస్తాయా, లేక భవిష్యత్తులో మరేవైనా ఇబ్బందులు తడితే అవకాశం ఉందా అనే సందేహాలు చాలామందికి కలుగుతాయి. ముందుగా అసలు బ్యాంకులు లోన్ కట్టని వారి ఇళ్లను స్వాధీనం చేసుకొని వేలం వేసే ప్రక్రియ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సాధారణంగా బ్యాంకు నుంచి లోన్ పొందిన అనంతరం ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది కస్టమర్లు సకాలంలో వాయిదాలను చెల్లించకపోతే బ్యాంకులు చట్టపరంగా రంగంలోకి దిగి ఇంటిని స్వాధీనం చేసుకుంటాయి. ఆ తర్వాత అలాంటి ప్రాపర్టీలను వేలం వేసి వచ్చిన డబ్బుతో లోన్ రికవరీ చేసుకుంటారు. ఈ వేలం ప్రక్రియ అనేది చట్టబద్ధంగా ఉంటుంది.

బ్యాంకులో ఆస్తులను వేలం వేసే ముందు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ (SARFAESI Act), 2002 కింద ముందుగా కస్టమర్లకు నోటీసులు పంపుతారు. సెటిల్మెంట్ చేసుకునేందుకు కూడా ముందుకు వస్తారు. ఒకవేళ ఆ పద్ధతి కూడా విఫలం అయినట్లయితే బ్యాంకులు రుణం చెల్లించని కస్టమర్ల ఇంటిని స్వాధీనం చేసుకొని బహిరంగ వేలంలో విక్రయించి తమ అప్పులను రికవరీ చేసుకుంటాయి.


సాధారణంగా బ్యాంకులు వేలంపాట ద్వారా విక్రయించే ఇలాంటి ఆస్తులు మార్కెట్ ధర కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఎవరైతే వేలంపాటలో ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ముందుగా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా లేదా అనే సంగతిని గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎవరైనా డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేయించుకుంటే మంచిది. . అలాగే ఈ తరహా వేలంలో పాలుపంచుకునే కస్టమర్లకు క్రెడిట్ స్కోర్ బాగుండాలని కూడా బ్యాంకులు కోరుకుంటాయి. దీంతోపాటు మీరు ఇల్లు కొనుగోలు చేసిన అనంతరం దానిపై ఉండే అదనపు ఖర్చులైనా రిజిస్ట్రేషన్ చార్జెస్, స్టాంప్ డ్యూటీ వంటి ఖర్చులను కూడా కొనుగోలుదారుడే భరించాల్సి ఉంటుంది. కనుక మీరు వేలం పాటలో కొన్న అమౌంట్ కన్నా అదనంగా కట్ చేయ అవకాశం ఉంటుందన్న సంగతి ముందుగానే గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు అసలు వేలం పాటలో ఎలా పాల్గొనాలో తెలుసుకుందాం.
>> ముందుగా బ్యాంకులు తాము వేలం వేయబోయే ఆస్తుల గురించి లిస్టు మొత్తం దినపత్రికల్లో ప్రకటన ఇస్తుంది. ఆ ప్రకటనలోనే వేలం వేసే తేదీ, ఆస్తి విలువ, దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం మొత్తం వివరిస్తారు. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉంటాయనే సంగతి గుర్తుంచుకోవాలి

>> ఆస్తి వేలంలో పాల్గొనాలంటే ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్తి ధరలో ఐదు నుంచి పది శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వేలంపాటలో మీరు గెలిస్తే ఆ డబ్బును మీరు ఫైనల్ పేమెంట్ లో మినహాయింపుగా పరిగణిస్తారు. ఒకవేళ వేలం పాటలో మీరు ఆస్తి సొంతం చేసుకోలేకపోతే మీ డిపాజిట్ డబ్బులు వెనక్కు తిరిగి ఇస్తారు.

>> కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఆన్ లైన్ వేలం పాట కూడా నిర్వహిస్తాయి. దీనికోసం మీరు ముందుగానే బ్యాంకు వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

>> సాధారణంగా వేలంపాటలో మీరు ఇంటిని సొంతం చేసుకున్నట్లయితే 15 నుంచి 90 రోజుల్లోగా మొత్తం డబ్బు చెల్లించి ఆస్తిని పొందాల్సి ఉంటుంది. ముందుగా మీరు వేలంపాటలో గెలిచిన వెంటనే ప్రాపర్టీ వ్యాల్యూలో 25% వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగతా 75% డబ్బు గడువు తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది.

Related News

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

Big Stories

×