E-Paper
Advertisement

Jio Recharge Plan: జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!

Jio Recharge Plan: జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!
Advertisement

Jio Recharge Plan: ప్రముఖ టెలికాం సంస్థ జియో.. తన యూజర్ల కోసం ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, సిమ్ యాక్టివ్ ప్లాన్స్, ఓటీటీ రీఛార్జ్ ప్లాన్స్ ఇలా వివిధ రకాల ధరల్లో పలు రకాల ప్రయోజనాలతో అవి అందుబాటులో ఉన్నాయి. అయితే జియో దగ్గర ఓ అద్భుతమైన ప్లాన్ ఉంది. రూ. 1748 ప్లాన్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంతకీ ఈ ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్లాన్ ఫీచర్లు ఏంటీ?

జియో రూ.1748 ప్లాన్ ను ఎక్కువగా ఫోన్ కాల్ మాట్లాడేవారి కోసం తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటా పెద్దగా అవసరం లేని వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్లాన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. అంటే దాదాపు 11 నెలల అన్నమాట. వ్యాలిడిటీ కాలంలో అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్, STD, రోమింగ్) పొందవచ్చు. మెుత్తం ప్లాన్ కాలపరిమితికి 3,600 SMSలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ లో ఎటువంటి డేటా (Internet) లభించదు.

ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్..

Advertisement

ఈ ప్లాన్‌తో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. JioTV లైవ్ టీవీ ఛానెల్స్, JioCinema ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు 336 రోజుల పాటు ఉచితంగా చూడవచ్చు. అయితే ప్రీమియం కంటెంట్ కు మాత్రం ఈ ప్లాన్ వర్తించదు. అటు జియో క్లౌడ్ ద్వారా మీ ఫోన్ డేటాను ఆన్ లైన్ లో భద్రపరుచుకోవడానికి క్లౌడ్ స్టోరేజ్ ను ఇది అందిస్తుంది.

Also Read: Jio vs Airtel vs VI: అపరిమిత కాల్స్, 5G డేటా.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. క్రేజీ ప్లాన్స్ భయ్యా!

ఈ ప్లాన్ ఎవరికి ఉపయోగకరం?

Advertisement

ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై ఉండి, మొబైల్ డేటాతో పనిలేని వారికి ఇది చాలా పొదుపైన ప్లాన్ అని చెప్పవచ్చు. అలాగే జియో ఫీచర్ ఫోన్ వాడే పెద్దవారికి ఇది ప్రయోజనకరం. అదే విధంగా మీ దగ్గర రెండు సిమ్‌లు ఉండి ఒక సిమ్‌ను కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసం మాత్రమే యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు డేటా అవసరమైతే జియో అందించే డేటా యాడ్ ఆన్ (Data Add on) ప్యాక్‌లను విడిగా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల వాయిస్ కాల్స్ కి రూ.1748 ప్లాన్.. డేటా కోసం చిన్న ప్యాక్‌లు వాడుకుంటూ ఖర్చు తగ్గించుకోవచ్చు.

Also Read: Amazon Coolers offer: రండి బాబు రండి.. ఫ్యాన్ల కంటే చౌకగా కూలర్లు.. ఏకంగా 70% వరకూ తగ్గింపు!

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×