Big Stories

New Gen Renault Duster: రెనాల్ట్ డస్టర్ నుంచి కొత్త ఎస్‌యూవీ.. అట్రాక్ట్ చేస్తున్న స్పోర్టీ లుక్!

New Generation Renault Duster Price and Features: రెనాల్ట్ డస్టర్ భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ కంపెనీ. దేశీయ మార్కెట్‌లో డస్టర్ కార్లకు డిమాండ్ భారీగానే ఉంటుంది. ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ఎస్‌యూవీల్లో డస్టర్ కూడా ఒకటి. అయితే తాజాగా రెనాల్ట్ ఇప్పుడు మరోసారి రెనాల్ట్ డస్టర్ కొత్త వేరియంట్‌ను తీసుకురానుంది. ఈ కొత్త వేరియంట్ ఫీచర్లు, తదితర విషయాలపై ఓ లుక్కేయండి.

- Advertisement -

కొత్త రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీటర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్‌లలో ఇవ్వబడిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌ ఉంటుంది. అంతే కాకుండా కారులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది. డస్టర్ ఇప్పటికే ఐరోపా మార్కెట్‌లోరెనాల్ట్ డాసియా మోడల్‌ను విక్రయిస్తోంది. ఇది చాలా విజయవంతమైన మోడల్.డాసియా మోడల్ 2010 నుండి 2.2 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది.

- Advertisement -
New Gen Renault Duster
New Gen Renault Duster

Also Read: ఫోర్డ్ రీ ఎంట్రీ.. ఆ కంపెనీలకు పోటీగా ఎస్‌యూవీ

2024 రెనాల్ట్ డస్టర్ సరికొత్త స్టైలిష్ అప్‌‌డేట్ ఇంటీరియర్‌తో వస్తుంది. కొత్త వేరియంట్ CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై మాన్యుఫాక్చర్ అవుతుంది. దీనికి కొన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కొత్త మోడల్ పాత మోడల్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది.అలానే దీని లుక్ స్పోర్టీగా ఉంటుంది.

కొత్త డస్టర్ ఎస్‌యూవీకి సంబంధించిన పెద్ద చక్రాలు,హెడ్‌ల్యాంప్‌లతో కూడిన డబుల్-స్టాక్ గ్రిల్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్, మందపాటి బూట్ డోర్ కనిపిస్తాయి. ఇందులో మీరు డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, గ్రే మరియు బ్లాక్ క్యాబిన్, సెంటర్ కన్సోల్‌ను చూడవచ్చు.

Also Read: జీప్ కంపాస్ కొత్త వేరియంట్ లాంచ్.. కేకపుట్టిస్తున్న స్పీడ్!

రెనాల్ట్ బేస్ మోడల్ సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అందిస్తూనే ఉంది. ADAS టెక్నాలజీని కొత్త డస్టర్‌లో కూడా చూడవచ్చు. ఈ SUV రీడిజైన్ చేయబడిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సెలెక్టర్ లివర్‌తో వస్తుంది. ఇది క్రూయిజ్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్ బటన్‌లతో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది. కంపెనీ క్యాబిన్ అంతటా గట్టి ప్లాస్టిక్‌ను ఉపయోగించింది. ఇది మునుపటి మోడల్ కంటే నాణ్యతలో మెరుగ్గా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News