BigTV English

Pottel Teaser: చదువుకుంటే పటేల్.. పనోడు ఒకటవుతారా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టేల్ టీజర్

Pottel Teaser: చదువుకుంటే పటేల్.. పనోడు ఒకటవుతారా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టేల్ టీజర్

Pottel Teaser: మల్లేశం సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మంచి హిట్ కోసం కష్టపడుతుంది. ఈ మధ్యనే తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామకు ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ఇప్పుడు అనన్య.. పొట్టేల్ అనే సినిమాతో వస్తుంది. సాహిత్ మోత్కురి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువచంద్ర కృష్ణ హీరోగా నటిస్తుండగా.. అజయ్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ మొత్తం రా అండ్ రస్టిక్ లా కట్ చేశారు. చదువు అంటే తెలియని పల్లెటూరు. ఆ పల్లెటూరును గుప్పెట్లో పెట్టుకున్న పటేల్.పిల్లలకు చదువు ఉంటే జ్ఞానం వస్తుంది.. తమలా బతకకూడదు అని ఆరాటపడే తల్లిదండ్రులు. ఇక చదువుకుంటే పటేల్.. పనోడు ఒకటి అవుతారు అంటే ఒప్పుకొని పటేల్.. ఆ తల్లిదండ్రులను ఏం చేశాడు. వారు తమ బిడ్డ భవిష్యత్తు కోసం ఎలాంటి సాహసాలు చేశారు..? అనేది కథగా తెలుస్తోంది.


చదువు అనేది చాలా ముఖ్యం.. అదే తలరాతలు మారుస్తుంది అనే లైన్ తీసుకొని కథగా మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ కథకు.. టైటిల్ లో ఉన్న పొట్టేల్ కు ఏంటి సంబంధం అనేది ట్విస్ట్ గా మార్చారు. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై హైప్ తెచ్చారు. ఇక కూతురును చదివించుకోవడానికి ఆరాటపడే తల్లిదండ్రులుగా యువచంద్ర కృష్ణ, అనన్య కనిపించారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అనన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×