E-Paper
Advertisement

Retirement Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 50,000 రావాలా?.. ఇలా పెట్టుబడి పెట్టండి

Retirement Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 50,000 రావాలా?.. ఇలా పెట్టుబడి పెట్టండి
Advertisement

Retirement Investment: పదవీ విరమణ తర్వాత నెల వారీ ఖర్చులు భారం అవుతాయి. ఇంటి ఖర్చులు, వైద్యం కోసం ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక అవసరమని నిపుణులు అంటున్నారు. పదవీ విరమణ తర్వాత నెలకు రూ.50 వేలు అంటే ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం రావాలంటే.. ఇప్పటి నుంచే పెట్టుబడి మొదలుపెట్టాలి. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లైఫ్ యాన్యుటీ లేదా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్, సైంటిఫిక్ పే లలో ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్మెంట్ కార్పస్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి 100 ఏళ్ల వరకు జీవిస్తాడనుకుంటే.. 40 ఏళ్ల రిటైర్మెంట్ లైఫ్ లో రూ. 6 లక్షల వార్షిక ఆదాయం అవసరం. ఈ నివేదిక నాలుగు పదవీ విరమణ ఆదాయ మార్గాలను సూచించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లైఫ్ యాన్యుటీ, SWP, సైంటిఫిక్ పే లో పెట్టుబడులు పెడితే.. పదవీ విరమణ ఖర్చులకు ఇబ్బందులు ఉండవని నిపుణులు అంటున్నారు.

పెట్టుబడి మార్గాలు

బ్యాంక్ ఎఫ్డీలు సురక్షితమైన పెట్టుబడి మార్గాలని నిపుణులు అంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత సంవత్సరానికి రూ. 6 లక్షలు కావాలంటే.. మీ పెట్టుబడి కార్పస్ దాదాపు రూ. 2.30 కోట్లు ఉండాలి. అందుకు తగిన విధంగా పెట్టుబడి పెట్టాలి. కానీ FDలో రాబడి తక్కువగా ఉంటుంది. వీటిపై ట్యాక్సులు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ యాన్యుటీ స్కీమ్ లలో ఏటా రూ. 6 లక్షలు పొందడానికి, మీకు దాదాపు రూ. 2.35 కోట్ల కార్పస్ అవసరం. మీ వార్షిక ఖర్చుల కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువ. అందుకు తగిన విధంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

మరో ప్రత్యామ్నాయం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP). మ్యూచువల్ ఫండ్ల SWPలో పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన పెట్టుబడిపై రాబడి కూడా పొందవచ్చు. SWPలో సంవత్సరానికి రూ. 6 లక్షలు రావాలంటే మీ కార్పస్ దాదాపు రూ. 1.60 కోట్లు ఉండాలి. నెక్ట్స్ సైంటిఫిక్ పే.. ఈ నాలుగు పెట్టుబడుల్లో సైంటిఫిక్ పే విధానానికి అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం. రూ. 6 లక్షల వార్షిక ఆదాయం పొందాలంటే.. పెట్టుబడి కార్పస్ దాదాపు రూ. 1 కోటి ఉండాలి.

ద్రవ్యోల్బణం అంచనాలతో

70 ఏళ్ల వయస్సు వచ్చేసరికి.. సంప్రదాయ పెట్టుబడులతో ఆదాయ అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం అంచనాలతో.. స్థిర డిపాజిట్లతో రూ. 10.7 లక్షల అవసరానికి రూ. 4.8 లక్షలు ఆదాయం మాత్రమే వస్తుంది. అదే లైఫ్ యాన్యూటీ పథకాలు రూ. 6.2 లక్షలు, SWPలు రూ. 7.3 లక్షలు రాబడిని అందిస్తున్నాయి. సైంటిఫిక్ పే లో ఏడాదికి రూ. 11.5 లక్షలను రాబడి వస్తుంది. ద్రవ్యోల్బణ మార్పులను.. FDలు 38 శాతం మాత్రమే కవర్ చేస్తున్నాయి. లైఫ్ యాన్యుటీలు 55 శాతం, SWPలు 68 శాతం, సైంటిఫిక్ పే 101 శాతం వరకు రక్షణ కల్పిస్తున్నాయి. మనకు 100 ఏళ్లు వచ్చే సరికి FDలు, యాన్యుటీ స్కీమ్స్ లేదా SWPలపై ఆధారపడితే.. పదవీ విరమణ తర్వాత సేవింగ్స్ త్వరగా ఖాళీ అవుతున్నాయి. కానీ సైంటిఫిక్ పే లో 100 ఏళ్లు వచ్చిన సరే రూ. 14.4 కోట్ల లెగసీ కార్పస్‌ను మిగిలే అవకాశం ఉంది. రిటైర్మెంట్ జీవితం కోసం ఎంత సేవ్ చేసుకోవాలనేది.. లాంగ్ లైఫ్, ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల వరద.. ఈక్విటీలతో సమానంగా ఇన్వెస్ట్మెంట్స్

Related News

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×