E-Paper
Advertisement

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?
Advertisement

బ్యాంకుల నుంచి హోమ్ లోన్, ఇతరాత్ర రుణాలు తీసుకోవడం సాధారణమే. ఆ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేవరకు ఇల్లు లేదా ఇతర ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్ వద్దే ఉంటాయి. ఒక వేళ మీరు లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. బ్యాంకులు ఆ ఆస్తులను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉంటుంది. మరి, లోన్ మొత్తం చెల్లించేశాక బ్యాంకు.. మీ ఒరిజనల్ డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోతే ఏం చెయ్యాలి? ఇలాంటి సమస్యే.. ముంబయికి చెందిన ఓ సంస్థకు ఎదురైంది. లోన్ కోసం వారు పెట్టుకున్న ఆస్తుల పత్రాలను బ్యాంకు మిస్ చేసింది. దీంతో న్యాయం కోసం ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆ బ్యాంకుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

చావు కబురు చల్లగా..

బాధ్యతగా ఉండాల్సిన బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన ఇన్ వోగ్ క్రియేషన్స్ అనే సంస్థ 1979లో SBI, దారావి బ్రాంచ్ నుంచి లోన్ తీసుకుంది. ఇందుకు ముంబై, తలోజా ప్రాంతాల్లోని వారి ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకు వద్ద ఈక్యూటీ (Mortgage) కింద తాకట్టు పెట్టారు. 2003, ఆగస్టులోనే ఆ సంస్థ రుణం మొత్తం చెల్లించేశారు. తమ డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలని కోరారు. బ్రాంచ్ ఆఫీసు మార్చడం వల్ల డాక్యుమెంట్స్ పోయాయంటూ చావు కబురు చల్లగా చెప్పారు బ్యాంక్ సిబ్బంది. వాటి కోసం చాలాచోట్ల వెతికామని, అయినా కనిపించలేదని చెప్పారు.

Advertisement

Also read: మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

కోర్టును ఆశ్రయించిన సంస్థ

లోన్ మొత్తం చెల్లించినా సంతోషించలేని పరిస్థితి ఏర్పడటంతో.. ఆ సంస్థ ప్రతినిధులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ (RBI) సెప్టెంబరు, 2023న జారీ చేసిన నిబంధనల ప్రకారం.. లోన్ తీరిపోయాక 30 రోజుల్లోగా ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలి. ఆలస్యమైతే రోజుకు రూ.5,000 నష్టపరిహారం బ్యాంకు చెల్లించాలి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1, 2023 నుంచి బ్యాంకు ఆస్తికి సంబంధించిన కాపీలు, రికార్డులను పూర్తిగా పునర్నిర్మించి ఇచ్చేంత వరకు రోజుకు రూ.5 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. బ్యాంకులు తమ నిర్లక్ష్యం వల్ల ఖాతాదారుల ఆస్తి కాగితాలు పోగొడితే, బ్రాంచ్ మార్పులు లేదా సిబ్బంది బదిలీల నెపంతో తప్పించుకోలేవని, వారికి జరిగే నష్టానికి పూర్తి బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.

Tags

Related News

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

ఎక్కువ షుగర్, సాల్ట్ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్‌పై వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.. వినియోగదారుల డిమాండ్

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

Big Stories

Advertisement
×