BigTV English

Anant Ambani Salary: చిన్న కొడుకంటే ముకేష్ అంబానీకి ఎంత ప్రేమో.. అనంత్ జీతం ఎంతో తెలిస్తే షాకే

Anant Ambani Salary: చిన్న కొడుకంటే ముకేష్ అంబానీకి ఎంత ప్రేమో.. అనంత్ జీతం ఎంతో తెలిస్తే షాకే

రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీకి చిన్న కొడుకు అనంత్ అంటే ఎంతో ఇష్టం. అనంత్ ఏది కోరినా కాదనడు. ఇటీవలే ఆయన వివాహాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాజాగా ఆయనకు కంపెనీలో కీలక పదవి కట్టబెట్టారు ముకేష్ అంబానీ. ఇలాంటిలాంటి పదవి కాదు, ఏడాదికి దాదాపు 20కోట్లు జీతం తీసుకునే పదవి. అంతే కాదు, ఆయనకు లభించే ఇతర సౌకర్యాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా అందరూ షాకవ్వాల్సిందే.


పోస్టల్ బ్యాలెట్
రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనంత్ అంబానీని నియమించేందుకు ముకేష్ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ నియామకానికి వాటాదారుల ఆమోదం కావాలి. అందుకే స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటీసులో దీన్ని ఉంచారు. వాటాదారుల ఆమోదం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలపాల్సి ఉంటుంది. అయితే అత్యధిక వాటా ముకేష్ కుటుంబం వద్దే ఉండటంతో.. వారి మాటే చెల్లుబాటు అవుతుంది. అనంత్ అంబానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవి చేపట్టడం ఇక లాంఛనమే.

జీత భత్యాలు..
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైతే అనంత్ అంబానీకి ఏడాదికి 10నుంచి 20కోట్ల రూపాయల జీతం లభిస్తుంది. కంపెనీ లాభాలపై కమిషన్ కూడా వస్తుంది. వ్యాపార అవసరాల నిమిత్తం కంపెనీ తరపున చేసే పర్యటనల సమయంలో అనంత్ అంబానీకి, అతని జీవిత భాగస్వామికి, వారి సహాయకులకు ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలన్నీ కంపెనీయే భరిస్తుంది. కమ్యూనికేషన్ ఖర్చులు, కార్ అలవెన్స్ కూడా లభిస్తాయి. వైద్య ఖర్చుల రీఎంబర్స్ మెంట్, భద్రతాపరమైన ఖర్చుల రీఎంబర్స్ మెంట్ కూడా కంపెనీ నుంచి తీసుకోవచ్చు.


మిగతా ఇద్దరు..
ముకేష్ అంబానీకి ముగ్గురు సంతానం. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ కవలలు. అనంత్ అంబానీ అందరికంటే చిన్నవాడు. ఈ ముగ్గురూ ఇదివరకే రిలయన్స్ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ పదవిలో ఉన్నవారికి జీతం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరికి రూ. 4 లక్షల సిట్టింగ్ ఫీజు, లాభంపై కమిషన్ రూపంలో రూ. 97 లక్షలు వారు తీసుకున్నారు. ముగ్గురిలో తొలిసారిగా చిన్న కొడుకుని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించడం ఇక్కడ విశేషం. అంటే ముగ్గురిలో చిన్నవాడైన అనంత్ అంబానీ కంపెనీ ఒక్కడే తరపున భారీ ప్యాకేజ్ అందుకోబోతున్నాడనమాట.

ముకేష్ అంబానీ పెద్దకొడుకు ఆకాష్, కాలేజీ చదువు పూర్తయ్యాక 2014లో రిలయన్స్ గ్రూప్ టెలికాం యూనిట్ జియోలో టీమ్ లీడ్ గా చేరారు. 2022 జూన్ లో టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్ కు ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ కి కూడా ఆకాష్ యజమాని. ఇక ముకేష్ ఏకైక కుమార్తె ఇషా అంబానీ.. రిటైల్, ఇ-కామర్స్ బిజినెస్ లను నడుపుతున్నారు. ప్రస్తుతం అనంత్ అంబానీ రిలయన్స్ ఫ్యూయల్ బిజినెస్ చూస్తున్నారు. శిలాజ ఇంధనాల నుండి సౌర ఫలకాల తయారీని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ని కూడా ఆయన లీడ్ చేస్తున్నారు. తల్లితో కలసి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో అనంత్ మెంబర్ గా ఉండటం విశేషం.

ఆ తప్పు జరగకూడదనే..
పెద్దాయన ధీరూబాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ సంస్థ ఎలా ముక్కలైందో అందరికీ తెలుసు. అన్నదమ్ములు ధీరూబాయ్, అనిల్.. వ్యాపారాలను విభజించుకుని విడిపోయారు. కానీ అనిల్ అప్పులపాలు కాగా, ముకేష్ మాత్రం వరుస విజయాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. తన తండ్రి చనిపోయినప్పుడు జరిగిన తప్పులు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే ముకేష్ అంబానీ తెలివిగా ముందుగానే భాగపంపకాలు జరుపుతున్నారు. ముగ్గురు బిడ్డల్లో ఎవరి వాటా వారికి కేటాయిస్తున్నారు. ముందుగా చిన్న కొడుకు అనంత్ అంబానీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు ముకేష్.

Related News

అమెరికా నుంచి మీ పిల్లలు డబ్బులు పంపుతున్నారా..అయితే ఈ ఐటీ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

బంగారం vs రియల్ ఎస్టేట్: భూమిపై పెట్టుబడి పెడితే లాభమా…బంగారం కొంటే లాభమా..?

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

Amazon Appstore: అమెజాన్ యాప్‌స్టోర్‌కు గుడ్‌బై.. ఇకపై శాశ్వతంగా మూత.. డేట్ కూడా ఫిక్స్!

BSNL Offers: BSNL రూబీ ప్లాన్ విడుదల, జియో, ఎయిర్ టెల్ కు దబిడి దిబిడే!

Big Stories

×