Samantha -Keerthy Suresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత (Samantha) ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈమెకు కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో దూసుకుపోతున్న సమంత ఇటీవల వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నారని చెప్పాలి. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొంతకాలం పాటు తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్ లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పెళ్లి తర్వాత మొదటిసారి..
ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థను కూడా స్థాపించి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఇక సమంత నెట్ ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల సమంత మరొక నటి కీర్తి సురేష్(Keerthy Suresh) ను కలిసిన సంగతి మనకు తెలిసిందే. కీర్తి పెళ్లి తర్వాత మొదటిసారి సమంతను కలవడంతో అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె అభిమానులతో పంచుకున్నారు.
ఆరోగ్యం జాగ్రత్త …
ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన సమంత మేము మధ్యాహ్నం లంచ్ టైం కి కలిస్తే సాయంత్రమైనా అలాగే మాట్లాడుతూనే ఉంటాము అంటూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలియజేశారు. అదేవిధంగా కీర్తి సురేష్ కి కూడా సమంత కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్లు పెద్ద ఎత్తున డైట్ ఫాలో అవుతూ చాలా స్లిమ్ గా అందంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. సమంత కూడా ఒకానొక దశలో ఇలా హెవీగా డైట్ చేయటం వల్ల ఆమె మయోసైటిసిస్ వ్యాధికి గురి అయిన విషయం తెలిసిందే.
చిరకాల ప్రేమికుడితో పెళ్లి..
ఇలా సమంత ఎదుర్కొన్న ఈ అనుభవాల గురించి కీర్తి సురేష్ కి తెలియచేస్తూ.. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దని, ఇప్పటికే చాలా బక్క చిక్కిపోయావు ఇలాగే బరువు తగ్గిపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కీర్తికి సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ ఇటీవల తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil)ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే కీర్తి సురేష్ ఇటీవల కాలంలో సన్నబడిన నేపథ్యంలోనే సమంత సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక కీర్తి సురేష్ త్వరలోనే ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జులై 4వ తేదీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.
Also Read: Rashmika Mandanna: అవసరం అయితే సినిమానే వదులుకుంటా.. కానీ, ఆ పని మాత్రం చేయను