BigTV English

Skoda Superb: భారీ నష్టాల్లో స్కోడా.. సింగిల్ కారే సేల్.. సూబర్బ్ కారు ఫీచర్లు ఇవే!

Skoda Superb: భారీ నష్టాల్లో స్కోడా.. సింగిల్ కారే సేల్.. సూబర్బ్ కారు ఫీచర్లు ఇవే!

Skoda Superb: స్కోడా తన లగ్జరీ సెడాన్ సూబర్బ్ కారును మార్చి 2024లో ఇండియా మార్కెట్‌లో విడుదల చేసింది. కస్టమర్లను ఆకర్షించడంలో కొత్త మోడల్ సక్సెస్ అవుతుందని కంపెనీ భావించింది. అయితే గత నెలలో ఈ మోడల్ సేల్స్ కంపెనీని టెన్షన్ పెట్టాయి. ఇది మే నెలలో నలుగురు కస్టమర్లు, జూన్‌లో ఒక కస్టమర్‌ని మాత్రమే సాధించింది. ఇది స్కోడాకు చెందిన లగ్జరీ సెడాన్ దీని ధర రూ.54 లక్షల ఎక్స్‌షోరూమ్‌తో లాంచ్ అయింది. స్కోడా కంపెనీ మొత్తం అమ్మాకాలు ఈ కారు వల్ల క్షీణించాయి. కంపెనీ ఫోర్ట్‌పోలియోలో కోడియాక్, కుషాక్, స్లావియాతో పాటు అనేక ఇతర కార్లు ఉన్నాయి.


స్కోడా లగ్జరీ సెడాన్ డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే ఈ కారులో క్రోమ్ సరౌండింగ్‌తో కూడిన సిగ్నేచర్ స్కోడా రేడియేటర్ గ్రిల్. ఫ్రంట్ బంపర్‌‌‌లో లోయర్ ఎయిర్ డ్యామ్, ఎల్‌‌ఈడీ హెడ్ ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, క్రిస్టల్ ఎలిమెంట్‌తో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలానే ఇందులో లేటెస్ట్ 18 అంగుళాల డ్యూయల్ టోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మోడల్ సిల్హౌట్‌లో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు.

Also Read: Mahindra Thar Five Door: అందిరిచూపు దీనిపైనే.. ఆగస్టు 15న థార్ లాంచ్.. ఫోటోలు లీక్!


స్కోడా ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 2.0 లీటర్, నాలుగు సిలిండర్, టీఎస్ఐ గ్యాసోలిన్ మోటర్ కలిగి ఉంది. ఇది 187 బీహెచ్‌బీ పవర్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇంజన్ 7 స్పీడ్ డీసీజీ ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. ప్రస్తుతానికి దీని మైలేజీకి సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. టెస్టింగ్ అనంతరం ఈ వివరాలు బయటకు రావచ్చు.

ఇది మొబైల్ కనెక్టవిటీతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీట్ కోసం మసాజ్ ఫంక్షన్, లెవర్ ర్యాప్డ్ గేర్ నాబ్, మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్ కలిగి ఉంది. అదనంగా ఇది వర్చువల్ కాక్‌పిట్, 12 స్పీకర్ కాంటన్ ఆడియో సిస్టమ్, వెనుక విండో, విండ్ స్క్రీన్ కోసం రోల్ ఆఫ్ సన్ వైజర్లు ఉన్నాయి.

Also Read: New Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 100 కిలోమీటర్ల రేంజ్.. రూ.లక్షతో దక్కించుకోండి!

భద్రత పరంగా ఇందులో ఏబీఎస్, హీల్ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, యాక్టివ్ టిపిఎమ్ఎస్, ఆటో హోల్డింగ్‌‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్గింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, పార్క్ అసిస్ట్, 9 ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ సెడాన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. సేఫ్టీ పరంగా దీనికి తిరుగులేదు.

Tags

Related News

Digital Currency: ఇండియాలో డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీని నో ఛాన్స్, మంత్రి గోయల్ క్లారిటీ

EPFO Pension Hike: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కనీస పెన్షన్ ​​రూ. 2,500 పెంచే ఛాన్స్

Gold Markets: దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్లు.. ఇక్కడ వేలకొద్ది గోల్డ్ షాపులు, లక్షల కోట్ల వ్యాపారం

Today Gold Price: బిగ్ బ్రేకింగ్.. 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

Mugdha 2.0: కూకట్ పల్లిలో సరికొత్తగా ముగ్ధా 2.0.. ప్రారంభించిన ఓజీ బ్యూటీ ప్రియాంక మోహనన్!

Diwali Offers: దీపావళి రీఛార్జ్ ఆఫర్లు తెలుసా?.. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వీఐ స్పెషల్ ప్లాన్స్ ఇవే!

Amazon Offers: అమెజాన్ షాపింగ్ పై 10% అదనపు క్యాష్‌బ్యాక్ .. సిఎస్‌బి బ్యాంక్ కొత్త ఆఫర్!

Cheque Clearance: ఇకపై గంటల్లోనే చెక్ క్లియరెన్స్.. ఇవాళ్టి నుంచి కొత్త రూల్ అమలు!

Big Stories

×