BigTV English

Yoga: యోగా గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

Yoga: యోగా గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

Yoga History: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించే యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. యోగా మూలాలన్నీ భారత్‌లోనే ఉన్నాయి. వేద కాలం నుంచి భారతదేశంలో యోగా ఉంది. స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేశారు. అనంతరం యోగా నెమ్మదిగా వ్యాప్తిలోకి వచ్చింది. మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేసిన సూచనలతో జూన్ 21ని అంతర్జాతీయ యెగా డేగా ఐక్యరాజ్య సమితి 2015లో ప్రకటించింది.


ప్రస్తుతం ఈ రోజు 190 దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తున్నారు. యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా స్వామి వివేకానందకు పేరుంది. వివేకానంద 1896లో అమెరికాలోని మన్ హటన్ నగరంలో రాజయోగా పుస్తకాన్ని ఆవిష్కరించాడు. దీంతో యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది. గడిచిన శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విభిన్నమైన యోగా ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో యోగాకు ప్రాముఖ్యత కూడా పెరిగింది.

వయస్సు పైబడిన వారు యోగా చేయొచ్చా:


యోగాకు వయస్సుతో సంబంధం లేదు. చాలా మంది ఏడు పదుల వయస్సులో కూడా యోగా చేయడం ప్రారంభిస్తున్నారు. అన్ని వయస్సుల వారికి ప్రత్యేకమైన యోగా ఆసనాలు ఉంటాయి. యోగా అనేది ఒక రకమైన వ్యాయామం. యోగాను చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయొచ్చు. శరీరం దృఢంగా ఉన్న వారే యోగా చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు.

యోగా చేస్తే కలిగే ప్రయోజనాలు:

  • యోగాతో ప్రశాంతత లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
  • యోగా ఆసనాలు వేసినప్పుడు శరీర అవయవాలకు, మనస్సుకు మధ్య సమన్వయంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది.
  • యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
  • శరీరం నుంచి వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
  • విద్యార్థులు యోగా చేస్తే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • యోగా వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి.

Tags

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×