Stock Market Crash: ఈ రోజు (ఏప్రిల్ 7, 2025న) స్టాక్ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో ప్రతి పెట్టుబడిదారుడి నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సెన్సెక్స్ 3,300 పాయింట్లు, నిఫ్టీ 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే 45 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మార్కెట్ ఇంతలా కుదేలైన సమయంలో పెట్టుబడి చేయాలా వద్దా. ఒకవేళ చేస్తే ఎక్కడ చేయాలి. మరోవైపు ఇప్పటికే దీర్ఘకాలంలో పెట్టుబడులు చేసిన వారు ఏం చేయాలనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భవిష్యత్తులో
ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకన్నా అవగాహన ముఖ్యం. మార్కెట్ ఎందుకు పడిపోయింది? ఎలాంటి వార్తలు దీనికి కారణమయ్యాయి? మన పెట్టుబడులపై దీని ప్రభావం ఎంత? ఇవన్నీ తెలుసుకోవడం చాలా ప్రధానం. ఈ క్రమంలో మీరు సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో భరోసాగా ఉండవచ్చు.
మార్కెట్ పతనానికి కారణాలు
అమెరికా స్టాక్ మార్కెట్‌లో గత వారం భారీ పతనం చోటుచేసుకుంది. డౌ జోన్స్ 1000 పాయింట్లు పడిపోయింది. FED వడ్డీ రేట్లపై వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో భయాందోళన కలిగించాయి. చైనా–తైవాన్, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు కూడా గ్లోబల్ మార్కెట్లను కుదిపేశాయి. మరోవైపు ట్రాంప్ సుంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపించాయి.
దేశీయంగా…
RBI సమావేశం ఏప్రిల్ 9న జరగనుంది. వడ్డీ రేట్ల పెంపుపై ఊహాగానాలు పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. పలు పెద్ద కంపెనీలు నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. ఈ క్రమంలో FII అమ్మకాలు, చిన్న పెట్టుబడిదారుల భయంతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. మార్కెట్ పతనానికి ఇవి బాగా సహకరించాయి.
కొత్త పెట్టుబడిదారులకు గమనిక
స్టాక్ మార్కెట్‌లో కొత్త వారు మార్కెట్ పడిపోయినప్పుడు “బ్లూ చిప్” స్టాక్స్‌ను తక్కువ ధరలకు కొనుగోలు చేసే మంచి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి మంచి కంపెనీల స్టాక్స్ తక్కువ ధరకు లభ్యమయ్యే అవకాశముంది. మీరు దీర్ఘకాల పెట్టుబడి దృష్టితో ఉన్నట్లయితే, అవి భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉంటుంది.
కానీ జాగ్రత్తలు అవసరం:
-ఒక్కసారిగా పెద్ద మొత్తం పెట్టకండి.
-ఏప్రిల్ 9న ఆర్బీఐ మీటింగ్ సహా పలు అంశాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్ స్పందించే ఛాన్సుంది
-మార్కెట్ ఇంకా దిగుతుందేమోనన్న భయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
-SIP (Systematic Investment Plan) ద్వారా నెలనెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి చేయడం ఉత్తమం.
Read Also: LPG Gas: సామాన్యులకు షాకిచ్చిన ప్రభుత్వం..ఎల్పీజీ గ్యాస్ …
వ్యూహం:
-మీ మొత్తం పెట్టుబడి మొత్తంలో 10–20%తో ప్రారంభించండి.
-మార్కెట్ స్థిరపడే వరకు మిగతా మొత్తాన్ని వేచి ఉంచండి.
-మ్యూచువల్ ఫండ్స్ లేదా ETFs ద్వారా డైవర్సిఫికేషన్ అనుసరించండి.
-రిస్క్ టాలరెన్స్ తక్కువగా ఉంటే, డైరెక్ట్ స్టాక్స్ కంటే డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉత్తమం.
పాత పెట్టుబడిదారులకు కీలక సూచనలు
మీరు ఇప్పటికే పెట్టుబడి చేసినవారై ఉంటే, ఈ పతనం మీ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం చూపించి ఉండొచ్చు. కానీ “panic selling”కి పోకండి. ఈ క్రాష్ తాత్కాలికం మాత్రమే. గత అనుభవాలు (2008, 2020) చూస్తే మార్కెట్ కొన్ని నెలల్లోనే కోలుకుంది. మీరు పెట్టుబడి చేసిన కంపెనీలు బలమైనవైతే, వాటిని కొనసాగించండి. మళ్ళీ పుంజుకునే అవకాశాన్ని ఉపయోగించుకోండి.
ఆస్తులపై కూడా
మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించండి. బలమైన కంపెనీలు ఉంచండి. అప్రూవ్‌డ్ బ్యాలెన్స్ షీట్, తక్కువ అప్పులు ఉన్న కంపెనీలు మంచి ఎంపిక. నష్టాలను కవర్ చేసేందుకు అర్ధం లేకుండా అమ్మకాలు చేయవద్దు. స్టాప్-లాస్ (Stop-loss) విధానాన్ని షార్ట్-టెర్మ్ ట్రేడింగ్‌లో అనుసరించండి. బంగారం, FD, బాండ్స్ వంటి ఇతర ఆస్తులపై కూడా దృష్టి పెట్టండి.
రాబోయే కీలక తేదీలు
-ఈ వారంలో వచ్చే ముఖ్యమైన డేటా మార్కెట్‌పై ప్రభావం చూపించే అవకాశముంది:
-ఏప్రిల్ 9: RBI MPC వడ్డీ రేట్ల నిర్ణయం
-ఏప్రిల్ 11: IIP (Industrial Production), CPI (Consumer Price Index) డేటా విడుదల
-ఈ రెండు అంశాలు మార్కెట్ రీబౌండ్ అవుతుందా లేదా ఇంకోసారి పతనమవుతుందా అనే దానిపై కీలకంగా ప్రభావితం చేస్తాయి.