Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. అయితే తాజాగా ఈ పథకంలో అవతవకలు జరుగుతున్నట్లు తెలియడంతో ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటించింది.
సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రకారం.. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు మాత్రమే ఇందుకు ఈ పథకానికి అర్హులు. అయితే కొన్ని సందర్భాల్లో పాపకు తాత, అమ్మమ్మ, నాన్నమ్మలుగా బంధుత్వం కలవారు కూడా సుకన్య సమృద్ధి యోజన ప్రకారం.. అకౌంట్లు ఓపెన్ చేసి డిపాజిట్లు చేస్తున్నట్లు తెలిసింది. పైగా ఒకటి కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు కొందరు కలిగి ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆగస్టు 21, 2024న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి నియమాల్లో మార్పులు చేసింది.
Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..
మారిన నియమాల ప్రకారం..
– పాప గ్రాండ్ పేరేంట్స్ (తాత, అమ్మమ్మ, నాన్నమ్మ)లు చట్టపరంగా గార్డియన్ షిప్ తీసుకోవాలి. లేదా అకౌంట్ మరో లీగల్ గార్డియన్, తల్లిదండ్రులకు ట్రాన్స్ ఫర్ చేయాలి.
– 2019 సుకన్య సమృద్ధి యోజన చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు కలిగి ఉంటే నియమాలను ఉల్లంఘించనట్లే. అలాంటి సందర్భంలో ఒక అకౌంట్ తప్ప మిగిలన అకౌంట్లన్నీ నిలిపివేయబడతాయి.
– పాప పాన్ కార్డు, ఆధార్ కార్డు అలాగే గార్డియన్ (తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్) పాన్, ఆధార్ కార్డు అకౌంట్ కలిగిన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో అప్డేట్ చేయడం తప్పనిసరి.
– ఆధార్, పాన్ కార్డు అప్డేట్ చేయని స్మాల్ సేవింగ్స్ అకౌంట్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
పై చెప్పిన నియమాలను ఖాతాలందరూ పాటించాలి. లేకుంటే ఆ అకౌంట్స్ ను ప్రభుత్వం సెటిల్ మెంట్ చేసే అవకాశముంది.
సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్ల చదువు, వివాహం, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో ప్రతి నెలా కనీష్ట డిపాజిట్ రూ.250, గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు చేసుకోవచ్చు. డిపాజిట్ పై తాజా త్రైమాసిక వడ్డీ రేట్ల ప్రకారం.. 8.2 శాతం వడ్డీ లభిస్తుంది.
ఈ అకౌంట్లో పెట్టుబడిపై డిపాజిట్ ప్రారంభించిన 21 సంవత్సరాల తరువాత మెచూరిటీ లభిస్తుంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఈ అకౌంట్ ని పర్యవేక్షిస్తారు.