Vivo V40e: పలు మోడళ్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Vivo త్వరలో తన లైనప్‌లో ఉన్న మరో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కంపెనీ లైనప్‌లో ఉన్న Vivo V40e త్వరలో దేశంలో ప్రారంభించబడుతుంది. ఈ క్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ఇప్పటికేే ఈ v సిరీస్‌లో Vivo V40 Pro, Vivo V40 దేశంలో రిలీజ్ అయ్యాయి. కాగా ఈ V40e డిజైన్ Vivo V40 Pro, Vivo V40 మాదిరిగానే ఉంటుందని చెప్పబడింది. ఇది కర్వ్డ్ డిస్‌ప్లే, వర్టికల్ ప్లేస్‌లో ఉంచబడిన పిల్ ఆకారపు వెనుక రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
ఇక దీని కలర్ ఆప్షన్ విషయానికొస్తే.. ఇది మింట్ గ్రీన్, రాయల్ బ్రాంజ్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల అంటే సెప్టెంబర్‌లోగా కంపెనీ తన V40eని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇదే ఫోన్‌పై తాజాగా ఓ నివేదిక దాని వేరియంట్ల గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 8 GB + 128 GB, 8 GB + 256 GB అనే రెండు వేరియంట్‌లలో తీసుకురావచ్చని చెప్పబడింది.
అలాగే దీని వేరియంట్లతో పాటు ధరను కూడా చెప్పింది. ఈ ఫోన్ రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య ఉంటుందని కూడా చెప్పబడింది. ఇక కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కోసం రూపొందించిన మైక్రోసైట్‌లో.. ఇది 6.77 అంగుళాల పూర్తి HD + (2,392 x 1,080 పిక్సెల్‌లు) 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెప్పబడింది.
Also Read: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!
ఇది గరిష్టంగా 4,500 నిట్‌ల బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటుందని చెప్పబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 80 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ కెమెరా అందించబడుతుంది.
అలాగే ప్రాసెసింగ్ విషయానికొస్తే.. ఇందులో MediaTek డైమెన్సిటీ 7300ని ప్రాసెసర్‌గా అందించే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం ప్రథమార్థంలో దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 60 శాతం పెరిగాయి. దీంతో త్వరలో మరిన్ని స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లను పొందేందుకు కంపనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త టెక్నాలజీలతో ఫీచర్లు అందించి ఆకట్టుకుంటుంది.