Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతివారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారికి సంబంధించిన విషయాలను తెలియజేశారు . ఈ నేపథ్యంలోనే ఈ వారం సురేఖ వాణి కుమార్తె సుప్రీత హాజరయ్యారు. ఇక సుప్రీత (Supritha)ఇటీవల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రీత తన ఆస్తులకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు.
సురేఖ వాణి గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అదేవిధంగా ఈమె భర్త సురేష్ తేజ కూడా ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే సురేష్ తేజ 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక అప్పటినుంచి సురేఖ వానికి కూడా అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇలా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి భారీ స్థాయిలోనే ఆస్తులు సంపాదించారంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్లో ఖరీదైన విల్లాలు రేంజ్ రోవర్ బెంజ్ కార్లు ఉన్నాయని భారీగా ఆస్తులను పోగు చేశారు అంటూ నిత్యం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సురేఖ వాణి ఆస్తులకు సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయి అంటూ ప్రశ్న వేశారు. సుప్రీత ఈ విషయంపై స్పందిస్తూ… ఇప్పటివరకు మాకు హైదరాబాదులో కనీసం సొంత ఇల్లు కూడా లేదు అంటూ షాకింగ్ విషయాన్నీ బయట పెట్టారు. గతంలో తాము ఒక ఇంట్లో రెంటుకు ఉండేవాళ్ళ అయితే అదే ఇంటిని తాము కొనుక్కున్నాము కానీ ఈఎంఐ కట్టలేక చివరికి ఆ ఇంటిని అమ్మేసి ఈఎంఐ కట్టామని సుప్రీత తెలిపారు. ఇక కార్ల విషయానికి వస్తే పాత కారును అమ్మడం అదే అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టి కారు తీసుకోవడం జరుగుతుంది అక్కడ కూడా తాము ఈఎంఐ చెల్లిస్తున్నామని ఈ సందర్భంగా సుప్రీత క్లారిటీ ఇచ్చారు.
ఇలా ఇన్నేళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే త్వరలోనే తన అమ్మకు ఒక మంచి ఇల్లు కానుకగా ఇస్తానని సుప్రీత తెలిపారు. ఈ ఏడాది ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదని వచ్చే ఏడాదికి అమ్మకు ఇంటిని కానుకగా అందిస్తాను అంటూ సుప్రీత ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అప్పుల గురించి కూడా మాట్లాడుతూ ప్రస్తుతానికి మాకు ఎలాంటి అప్పులు లేవు అలాగని మాకు తినడానికి మేము తిరగడానికి సరిపడా డబ్బు ఉంది కానీ, ఆస్తులు లేవు అంటూ సుప్రీత తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!