E-Paper
Advertisement

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క
Advertisement

Nani Remuneration:నాని ..ప్యారడైజ్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేద్దామనుకున్నాడు .కానీ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ మూటగట్టుకోవడంతో అంచనాలు తప్పాయి.అయినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదన్న టాక్ ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది.

నిజానికి ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోగా సినిమాలు చేసిన నాని క్రమంగా ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో మంచి మార్కెట్ నే సంపాదించుకున్నాడు.వీటిలో దసరా ‘దసరా’కు సుమారు రూ.25 కోట్లు తీసుకోగా ,కాస్త అటూ ఇటూగా మిగతా రెండు సినిమాలకి కూడా ఆ రేంజ్ లోనే పుచ్చుకున్నాడని సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Advertisement

రూ.25 కోట్ల నుంచి రూ.35–40 కోట్లకు?

మీడియాలో వచ్చిన టాక్ ని బట్టి చూస్తే ‘ది ప్యారడైజ్’ కోసం నాని సుమారు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఇది నిజమైతే మాత్రం ఆయన కెరీర్‌లోనే ఇదే హాయ్యెస్ట్ పారితోషికం అని చెప్పాలి.అయితే ఈ మొత్తాన్ని నాని లేదా సినిమా నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి.

Advertisement

ఇక ఇదిలా ఉంటె తాజాగా చేయబోతున్న బ్లడీ రోమియోకి ఏకంగా 50 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది,ప్యారడైజ్ సినిమా సో సో అయినా ఈ స్థాయిలో డిమాండ్ చేయడమే సాహసమనే చెప్పాలి.

అయితే సినిమాకి రూ.30 కోట్లతో పాటు కొంత లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడు అంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది .’అంటే ఇక్కడ నాని లెక్క కేవలంఇంత రెమ్యునరేషన్ దగ్గరే కాకుండా సినిమా బడ్జెట్, మార్కెట్, లాభాల్లో వాటా వంటి అంశాల చుట్టూ కూడా తిరుగుతుందన్న మాట.

నాని రేట్ ఎందుకు పెరుగుతోంది?

నిజానికి నాని మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం ఆయన ఎంచుకుంటున్న సినిమాలనే చెప్పాలి . ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు ఒకదానికొకటి డిఫరెంట్ గా ఉండటం ,పైగా అవి ఆడియన్స్ కి నచ్చడంతో నాని మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ముఖ్యంగా ‘దసరా’తో నాని తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకుని మార్కెట్ ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు.

అయితే అదే మాస్ ఇమేజ్ ని మరింత పెంచుకుందామని అనుకున్న నానికి ప్యారడైజ్ పెద్ద దెబ్బె వేసింది.అయినప్పటికీ పారితోషికం మాత్రం తగ్గించలేదనే టాక్ వినిపిస్తుంది.చూడాలి మరి సినిమాకి ఏకంగా 50 కోట్లు పుచ్చుకుంటున్నాడు అంటూ వస్తున్న వార్తలపై ఈ న్యాచురల్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతాడో !

also read:రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

Tags

Related News

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×