Big Shock To Pakistan Cricket Team: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో జరిగిన ఫైనల్స్ సందర్భంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. దీంతో గోల్డ్ మెడల్ చేజేతులా పోగొట్టుకుంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా వైఫల్యం అవుతున్న నేపథ్యంలో బ్రాడ్ కాస్టర్ల నుంచి పూర్తిగా ఆదరణ తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ స్వదేశీ సిరీస్ ల టీవీ ప్రసార హక్కులను PCB ఆశించిన రేంజ్ లో కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఆశించిన దాంట్లో సగం డబ్బులు మాత్రమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు దక్కాయి. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంటులో గోల్డ్ మెడల్ మిస్ చేసుకున్న పాకిస్తాన్ కు మరో ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే సిరీస్ ల ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు బ్రాడ్ కాస్టర్లు ఆసక్తి చూపించలేదు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు పెద్దగా ప్రదర్శన కనపరచడం లేదు. పురుషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళలు కూడా అలాగే తయారయ్యారు. దీంతో క్రికెట్ అంటేనే అక్కడి అభిమానులకు విసుగు వచ్చింది. ఈ క్రమంలో తమకు లాభాలు రావని ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.
చివరికి పాకిస్తాన్ స్వదేశీ సిరీస్ ల ప్రసార హక్కులను పీటీవీ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. 350 మిలియన్లు పెట్టి మరి కొనుగోలు చేసింది. అంటే 35 కోట్ల రూపాయలకు మాత్రమే దక్కించుకుంది. 60 కోట్లకు కొనుగోలు చేసేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా ధర నిర్ణయించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆట తీరు సరిగ్గా లేదని ఎవరు ముందుకు రాక… 35 కోట్లకే పీ టీవీ స్పోర్ట్స్ ఈ హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సగానికి పైగా నష్టం జరిగింది. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లు అడుక్కుతినాల్సిందేనని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
కొత్త డీల్ ప్రకారం మొత్తం 25 అంతర్జాతీయ మ్యాచ్ ఇలా ప్రసార హక్కులను పిటివి స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. ఇందులో ఐదు టెస్టులు, 14 వన్డేల తో పాటు ఆరు టి20 లు ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో 14 వన్డేలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫైనల్ చేసింది. అందుకే పిటివి స్పోర్ట్స్ సొంతం చేసుకున్న సిరీస్ లలో వన్డేలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా 19 పరుగులు తేడాతో టీం ఇండియా చేతిలో ఓడిపోయింది పాకిస్తాన్.