BigTV English

Swiggy New Feature : ఫుడ్ అయినా ఎంటర్‌టైన్మెంట్ అయినా ఒక్క క్లిక్ దూరమే.. స్విగ్గీ సరికొత్త ఫీచర్ తెలుసుకోండి..

Swiggy New Feature : ఫుడ్ అయినా ఎంటర్‌టైన్మెంట్ అయినా ఒక్క క్లిక్ దూరమే.. స్విగ్గీ సరికొత్త ఫీచర్ తెలుసుకోండి..

Swiggy New Feature : ఇప్పటి వరకు మీ సమీపంలోని రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ఇష్టమైన ఆహారాన్ని నేరుగా ఇంటికే డెలివరీ చేసేందుకు పని చేసిన స్విగ్గీ.. ఇకపై మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఫుడ్ డెలివరీతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే, ఉపయోగపడే సేవల్ని.. తన ప్లాట్ ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.


స్విగ్గీ యాప్ లోని డైన్ అవుట్ ఆప్షన్ పక్కనే  సీన్స్ అనే కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీరుండే ప్రాంతాల్లోని వివిధ ఈవెంట్ల టికెట్లను కొనుగోలు చేయవచ్చు. క్రిస్టమస్ వేడుకల నుంచి లైవ్ మ్యూజిక్ ఈవెంట్లు, డీజే పార్టీలు వరకు వివిధ కార్యక్రమాలకు సంబంధించిన టికెట్లను స్విగ్గీ యాప్ లోనే నేరుగా పొందవచ్చు. స్వీగ్గీ యాప్ వినియోగదారులు మరింత సులువుగా, సౌకర్యవంతంగా ఈవెంట్లుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ తీసుకువచ్చినట్లు స్వీగ్గీ ప్రకటించింది.

డైన్ అవుట్ విభాగంలో టికెట్ బుకింగ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవల ద్వారా.. మీరుండే నగరాలు, పట్టణాల్లో రానున్న రోజుల్లో జరగనున్న ఈవెంట్లకు సంబంధించిన సమాచారం ఉంటుంది. మీకు ఇష్టమైన, ఆసక్తి ఉన్న ఈవెంట్లకు హాజరుకావాలనుకుంటే ఇందులో వెంటనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు ముంబై, బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే మిగతా నగరాలకు ఈ సేవల్ని విస్తరించేందుకు ప్రణాళికల్ని రూపొందిస్తోంది.


పండుగల నుంచి ప్రత్యక్ష ప్రదర్శనల వరకు యూజర్లు వివిధ ఈవెంట్లు సెర్చు చేసుకోవచ్చు. కావాలంటే టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్వీగ్గీ తెలిపింది. సరదాగా కుటుంబంతో కలిసి డైనింగ్, ఎంటర్ టైన్మెంట్  ప్లాన్ చేయాలనుకునే వారు.. వేరువేరు యాప్ ల్లో సెర్చ్ చేసే ఇబ్బంది లేకుండా నేరుగా స్వీగ్గీలోనే పనైపోనుంది.

రెవెన్యూ పెంచుకునేందుకు ఫుడ్ డెలివరీ యాప్ లు ఇలా వినూత్నంగా సేవల్నిఒక్కచోటకి తీసుకు వస్తున్నాయి. స్విగ్గీ కంటే ముందే జొమాటో డిస్ట్రిక్ట్ పేరుతో ఓ యాప్ ను ఆవిష్కరించింది.  ఇందులో.. సినిమా టికెట్లు, స్పోర్ట్స్ ఈవెంట్ టికెట్లతో పాటు రెస్టారెంట్ టేబుల్స్ బుక్ చేసుకునేందుకు కావాల్సిన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సరిగా ఈ యాప్ సేవల మాదిరిగానే ప్రస్తుత స్విగ్గీ యాప్ కూడా పని చేయనుంది. అయితే.. ప్రస్తుతం సీన్స్ లో లైవ్ ఈవెంట్లు, పార్టీలకు టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. ఇంకా సినిమా టికెట్లు పొందే ఫీచర్ ను తీసుకురాలేదు. రానున్న రోజుల్లో ఆ వెసులుబాటునూ తీసుకువచ్చే అవకాశాలున్నట్లు స్విగ్గీ తెలిపింది.

ప్రస్తుతం స్విగ్గీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. 2024-25 ఆర్థిక ఏడాదిలోని క్యూ2 కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.626 కోట్లుగా చూపించింది. గతేడాదికి ఇదే సమయానికి.. ఇది రూ.657 కోట్లు గా ఉండగా.. గతేడాదితో పోల్చితే ఇది 4.72 శాతం తగ్గింది. ఓ వైపు నష్టాలు వస్తుండగా.. ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం క్రమంగా పెరుగుతుండడం స్విగ్గీకి కాస్త ఊరట కలిగించే అంశమంటున్నారు. గతేడాదిలో రూ.2,763 కోట్ల ఆదాయం సమకూరగా.. ప్రస్తుతం రూ.3,601 కోట్లకు ఆదాయం చేరుకుంది.

Also Read : స్థిరంగా బంగారం ధరలు.. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్.. మళ్లీ పెరగొచ్చు

2024 ఆర్థిక సంవత్సరానికి.. స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకోగా, నష్టాలు 44 శాతం తగ్గి రూ. 2,350 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో తన ప్రత్యర్థి జొమాటో లాభాల బాటలో నడుస్తోంది. గతేడాది.. జొమాటో రూ.12,114 కోట్ల ఆదాయాన్ని గడించగా.. అందులో రూ. 351 కోట్లు లాభాలుగా చూపించింది. 

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×