BigTV English

Atlee: స్టార్ డైరెక్టర్ లుక్స్ ను హేళన చేసిన కపిల్.. ఇచ్చిపడేసిన అట్లీ

Atlee: స్టార్ డైరెక్టర్ లుక్స్ ను హేళన చేసిన  కపిల్.. ఇచ్చిపడేసిన అట్లీ

Atlee: టాలెంట్ ఉన్నవాడిని ఎవరు ఆపలేరు. వారి  రూపం, రంగు ఏది వారి సక్సెస్ ను ఆపలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నవారందరు కూడా మొదట్లో హీరోగా పనికిరావు అనే అన్నారు.  కానీ, తమలో  ఉన్న టాలెంట్ ను నమ్మి.. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టే ఇప్పుడు స్టార్స్ గా మారారు. కానీ, ఇప్పటికీ కొంతమంది ఆ టాలెంట్ ను గుర్తించకుండా కలర్ తక్కువ ఉన్నాడు.. ముఖం బాలేదు.. మూతి బాలేదు అని వంకలు పెడుతూ ఉంటారు.  తాజాగా కోలీవుడ్ వాటర్ డైరెక్టర్ అట్లీకి  ఇలాంటి అవమానమే బాలీవుడ్ లో జరిగింది.


రాజా రాణి అనే సినిమాకు దర్శకుడిగా అట్లీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమానే  బాక్సాఫీస్  వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతోనే అట్లీ.. స్టార్ హీరో విజయ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా విజయ్ తో మూడు సినిమాలు  తెరకెక్కించి హిట్స్ అందుకున్నాడు.

Bigg Boss Gautham :నేను రన్నరప్ అని తెలియగానే, చరణ్ అన్న నాతో చెప్పిన మాటలు


ఇక ఆ హిట్ టాక్ తోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. అట్లీని బాలీవుడ్ కు ఆహ్వానించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం జవాన్.  బాలీవుడ్ మొత్తం పరాజయాల మధ్యలో ఉన్న సమయంలో  షారుఖ్  నటించిన రెండు సినిమాలు.. పఠాన్, జవాన్ లే ఇండస్ట్రీని ఆదుకున్నాయి. జవాన్ తరువాత అట్లీకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ జాన్.

వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం.. తమిళ్ లో మంచి విజయాన్ని అందుకున్న తేరి సినిమాకు రీమేక్. తన సినిమాను తానే రీమేక్ చేస్తున్నాడు అట్లీ. ఇక ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Action Thriller Movie : ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రం బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే.. కపిల్  శర్మ షోకు వెళ్లకుండా ప్రమోషన్ ముగియదు అనే చెప్పాలి. తాజాగా బేబీ జాన్ టీమ్ కూడా కపిల్ శర్మ షోలో సందడి చేశారు.

ఇక ఈ షోలో కపిల్.. అట్లీని లుక్ ని ఎగతాళి చేసి మాట్లాడాడు. మీరు కథ చెప్పడానికి స్టార్ హీరోల వద్దకు వెళ్ళినప్పుడు.. ఎవరైనా అట్లీ ఎక్కడ.. ? కనిపించడం లేదు.. ? అని కానీ, డైరెక్టర్ మీరా.. ? అని అడగలేదా.. ? అని అడిగాడు. కపిల్ ఉద్దేశ్యం ఏంటో అర్ధం చేసుకున్న అట్లీ అతనికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు.

Sudigali Sudheer- Rashmi: సుధీర్ ను అందుకే వదిలేశా.. ఎట్టకేలకు ఓపెన్ అయిన రష్మీ..?

” మీరు ఈ ప్రశ్న ఎందుకు వేశారో నాకు అర్దమయ్యింది. మనలో టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద ముఖ్యం కాదు. ఆ విషయంలో మురగదాస్ గారికి థాంక్స్ చెప్పాలి. నేను కథ  చెప్పడానికి వెళ్ళినప్పుడు  ఆయన నా కథను విని.. నచ్చింది అన్నారు. నా రూపం చూడలేదు. అందుకే నాకు అవకాశం ఇచ్చారు.

ఈ ప్రపంచం మన ప్రతిభ గురించి మాట్లాడుకోవాలి తప్ప లుక్స్ గురించి కాదు.. మన టాలెంట్ నే  ఈ ప్రపంచం చూస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అట్లీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి బేబీ జాన్ సినిమాతో అట్లీ  బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×