Today Gold Rate: భారతీయ మహిళలు బంగారం అంటే చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు సమయాల్లో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బంగారం ధరలు గత కొంతకాలంగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన నేపథ్యంలో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి బంగారం ధరలు పతనమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ గోల్డ్ రేట్స్ ఒకరోజు తగ్గుతూ.. మరొక రోజు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు(డిసెంబర్ 16)న రేట్లు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,890 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
తెలంగాణ, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,890 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.57,120 వద్ద స్తిరంగా కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,890 పలుకుతోంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,890 వద్ద కొనసాగుతోంది.
పలు నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,550 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,040 వద్ద స్థిరంగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,890 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,400వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,890 ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,400 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,890 వద్ద స్థిరంగా ఉంది.
Also Read: కొండలా పేరుకుపోతున్న పసిడి నిల్వలు.. భారత్‌లో ఎంత గోల్డ్ ఉందో తెలుసా?
వెండి ధరలు ఇలా..
గత రెండురోజుల నుంచి వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,00,000 ఉంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరు,కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ. 92,500 పలుకుతోంది.