E-Paper
Advertisement

Under Rs.10 Lakh Cars: ఈ కార్ల ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు.. రూ. 10లక్షల లోపే!

Under Rs.10 Lakh Cars: ఈ కార్ల ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు.. రూ. 10లక్షల లోపే!
Advertisement

Under 10 Lakh Rupees Car: కారన్నా.. వాటిలో ప్రయాణించాలన్నా మనలో అందరికి ఇష్టమే అని చెప్పాలి. అందుకే కారు ఎక్కడ కనిపించినా దాని పక్కనే నుంచోని ఒక ఫోటో దిగుతుంటారు. కారు కొనాలనేది ఒక డ్రీమ్‌గా కూడా కొందరు భావిస్తారు. అయితే కారు ధరలు చూస్తే లక్షల్లో రూపాయల్లో ఉంటాయి. దీనితో వారి కళ కళగానే మిగిలిపోతుంది. మరికొందరైతే తక్కువ ధరలో మంచి సేఫ్టీ ఫీచర్లు తదితర విషయాలను చూసి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు.

మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే కార్లను తెగ వెతికేస్తుంటారు. అయితే మీరు ఇక టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కోసం మేము.. మీరు కోరుకున్నట్లుగా 5 కార్లను పరిశీలించి ఆ సమచారాన్ని మీకు అందిస్తున్నాము. వీటి ధర, ఫీచర్లు, ఇంజన్ పవర్ తదితర విషయాలను చూస్తే కొనకుండా ఉండలేరు.

Advertisement

మహీంద్రా XUV300: మహీంద్రా XUV300 1.2-లీటర్ త్రీ-పాట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 108 hp పవర్‌ని  ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌తో నడిచే ఈ XUV300 ధరలు రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి

Also Read: రెనాల్ట్ డస్టర్ నుంచి కొత్త ఎస్‌యూవీ.. అట్రాక్ట్ చేస్తున్న స్పోర్టీ లుక్!

Advertisement

టాటా నెక్సాన్: టాటా నెక్సాన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 8.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా: మారుతి సుజుకి బ్రెజ్జా 1.5-లీటర్ సహజంగా ఆశించిన 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ అయింది. ఇది 102 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ సబ్-4 మీటర్ SUV ధర రూ. 8.29 లక్షలుగా ఉంది.

మారుతీ సుజుకి ఎర్టిగా:మారుతి సుజుకి ఎర్టిగా 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 102 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ MPV వెహికల్ ప్రారంభ ధర రూ. 8.64 లక్షలుగా ఉంది.

Also Read: యమహా ఏరోక్స్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు

టాటా ఆల్ట్రోజ్ iTurbo: టాటా ఆల్ట్రోజ్ iTurbo 108 hp పవర్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. Altroz ​​iTurbo వేరియంట్ ధరలు రూ. 9.1 లక్షలు నుండి ప్రారంభమవుతాయి.

Tags

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×