BigTV English

Ram Charan – IFFM 2024: రామ్‌ చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం.. తొలి భారతీయ సెలబ్రిటీగా గుర్తింపు..!

Ram Charan – IFFM 2024: రామ్‌ చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం.. తొలి భారతీయ సెలబ్రిటీగా గుర్తింపు..!

Indian Film Festival of Melbourne: ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ బట్టి తన నెక్స్ట్ మూవీ కూడా గ్రాండ్‌ లెవెల్లో ఉండాలిని అనుకున్నాడు. ఇందులో భాగంగానే పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో స్టార్ అండ్ క్రేజీ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేసిన శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో హైప్ ఓ రేంజ్‌లో ఉంది.


కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్ సినిమా రేంజ్‌నే మార్చేసింది. సాంగ్‌లో రామ్ చరణ్ లుక్, డాన్స్ అదిరిపోయాయి. సాంగ్ కూడా ఆడియన్స్‌కు బాగా నచ్చేసింది. దీంతో ఒక్క సాంగ్‌తోనే రచ్చ రచ్చ అయింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ల కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Also Read: శంకర్ మావా.. మా ఆశలన్నీ ఇక గేమ్ ఛేంజర్ మీదనే


ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు చరణ్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్‌సి 16’ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉంటున్న రామ్ చరణ్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (IFFM 2024) 15వ ఎడిషన్‌లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు.

అయితే ఈ IFFM 2024 15వ ఎడిషన్‌కి అతిథిగా వెళ్లడమే కాకుండా.. భారతీయ సినిమాకి చేసిన సేవలకు గానూ చరణ్ ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును కైవసం చేసుకోబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా Indian Film Festival of Melbourne (IFFM) తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందుకోనున్న తొలి భారతీయ సెలబ్రిటీ చరణ్ కావడం గమనార్హం. అయితే ఈ ఘనతపై చరణ్ స్పందించాడు. ఈ మేరకు IFFM 2024 లో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నట్లు తెలిపాడు. ఈ వేడుక ఆగస్టు 15 నుండి 25వ తేదీ వరకు జరగనుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×