BigTV English

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. 8 మంది మృతి

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. 8 మంది మృతి

Bangladesh Violence: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరో సారి అల్లర్లు జరుగుతున్నాయి. ఢాకా నగర శివారులో వేలాది మంది నిరసన కారులు, అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అంతే కాకుండా 20 మందికి పైగా గాయాలయ్యాయి. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే వారిని అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్ యువజన విభాగం జుబో లీగ్ క్యాడర్ వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది.


ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఢాకా శివారులోని మున్షిగంజ్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పెట్రోల్ బాంబులు పేలినట్లు కూడా బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

Also Read: ఇరాన్‌ను రెచ్చగొడుతున్న అమెరికా.. ఆపలేని యుద్ధం మొదలైందా?


వాహనాలకు నిప్పు..
ఢాకాలోని షాబాద్ వద్ద వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం ఉదయం ఢాకాలోని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ వద్ద అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. కొందరు వ్యక్తులు ఆసుపత్రి ఆవరణలోని ప్రయివేటు కార్లు, అంబులెన్స్‌లు, బైక్‌లు, బస్సులను కర్రలతో ధ్వంసం చేసారు. దీంతో  ఆసుపత్రి ఆవరణలోని రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది భయాందోళనకు లోనయ్యారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×