Tata Sierra EV: ఈవీ కార్ల మార్కెట్ జోరు పెరగనుందా? కంపెనీలు తమ తమ వాహనాలను వినియోగదారులకు పరిచయం చేసే పనిలో పడ్డాయా? రీసెంట్‌గా ఢిల్లీలో జరిగిన కార్ల ఎక్స్ పోలో ప్రదర్శనకు పెట్టింది టాటా సియెర్రా ఈవీ. ఇంతకీ ఎప్పుడు మార్కెట్లోకి వస్తోంది? కొందరేమో సెకండ్ క్వార్టర్‌లో రావచ్చని, మరొకరు ఈ ఏడాది చివరలో రావచ్చని అంటున్నారు. ప్రస్తుతం టెస్టు డ్రైవింగ్ జరుగుతోంది. ఇంతకీ ఆ కారు ఫీచర్స్ ఏంటి? అనేదానిపై ఓ లుక్కేద్దాం.
జనవరిలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో టాటా సియెర్రా ఈవీ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సంవత్సరం చివరి నాటికి టాటా సియెర్రాను విడుదల చేయాలని భావిస్తోంది. కొత్త సియెర్రా టెస్ట్ డ్రైవ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. కొన్ని వారాలుగా SUV దాని ప్రొడక్షన్-స్పెక్ దుస్తులలో తిరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని మోడళ్ల ఫోటోలు బయటకు వచ్చాయి.
టాటా సియెర్రా ఈవీ- ఐసీఈ వెర్షన్‌తో అందుబాటులోకి రానుంది. టాటా సియెర్రా ఈవీ ఐసీఈ వెర్షన్ అందుబాటులోకి రానుంది. టాటా కర్వ్ ఈవీ (ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో దీన్ని ప్రదర్శనకు ఉంచారు). హారియర్ ఈవీల కంటే ముందు సియెర్రా ఈవీ మార్కెట్లోకి అడుగుపెడుతుందని భావిస్తున్నారు.
ఇంజిన్ -పవర్‌ట్రెయిన్ టాటా సియెర్రా ఈవీ, 1.5 లీటర్ T-GDi టర్బో-పెట్రోల్ ఇంజిన్, 165 HP మరియు 280 Nm టార్క్‌ను వస్తుందని భావిస్తున్నారు.అలాగే 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ వరుసగా 170 HP మరియు 350 Nm గరిష్ట శక్తి మరియు టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు. ట్రాన్స్‌మిషన్ ఎంపికలో మాన్యువల్ గేర్‌బాక్స్, ఇంజిన్ ఎంపికలతో ఆటోమేటిక్ ఎంపికలు ఉంటాయని చెబుతున్నారు.
ALSO READ: హెల్త్ ఇన్యూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్
టాటా సియెర్రా ఈవీ కచ్చితమైన ఫీచర్ల జాబితాను ఆ కంపెనీ వెల్లడించ లేదు. ఫీచర్స్ జాబితా పెద్దదిగానే ఉంటుందని వాహనదారులు అంచనా. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ టెయిల్ గేట్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి.
సియెర్రా లెవల్-2 ADAS ఫీచర్లను పొందుతుందని భావిస్తున్నారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, EBDతో ABS, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
టాటా సియెర్రా ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుందని అంటున్నారు. అయితే టాటా సియెర్రా ఈవీ లాంచ్ తేదీని టాటా కంపెనీ ప్రకటించాల్సి ఉంది. ఇతర వివరాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సియెర్రా.. మహీంద్రా థార్, మారుతి సుజుకి జిమ్నీ వంటి వాటికి పోటీగా ఉంటుంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన పద్ధతిలో ఉండనుంది. ధర మాత్రం రూ. 13 లక్షల నుండి ప్రారంభమతుందని వినియోగదారులు ఓ అంచనా వేస్తున్నారు.