Tax Benefit Schemes: పన్ను పరిధి నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నారా? కేంద్రం ఇచ్చిన ట్యాక్స్ స్లాబ్ ఏ మాత్రం సరిపోలేదా? పన్ను నుంచి మినహాయింపు పొందాలని భావిస్తున్నారా? ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినా సూచీలు నేల చూపు చూస్తున్నాయా? వీటన్నింటికీ అదిరిపోయే ఆలోచన. పెట్టుబడికి సురక్షితం, ఆపై సేవింగ్ కూడా. అదేనండి పోస్టాపీసులో ఐదు రకాల ట్యాక్స్ సేవింగ్ పథకాలు అందులో వున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
పన్ను నుంచి తప్పించుకోవాలా?
పోస్టాఫీసు అందిస్తున్న చిన్న పొదుపు పథకాలు అత్యంత సురక్షితమైనవి. ఇవన్నీ కేంద్రం ప్రవేశపెట్టిన స్కీములు కావడంతో ఎలాంటి రిస్క్ చేయనవసరం లేదు. వాటిలో పెట్టుబడులు పెడితే ప్రయోజనం చాలానే ఉన్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపు దారులు పన్ను మినహాయింపులు సునాయసంగా పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ద్వారా వర్తించే ఐదు పోస్టాఫీసులు పథకాలకు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు వస్తుంది.
మనీ సేవింగ్.. ఆపై పన్ను సడలింపు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చాలా మంచి పథకం. సెక్షన్ 80సీ ద్వారా ఇన్వెస్ట్ చేసి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు వస్తుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతంగా ఉంది. మెచ్యూరిటీ సయమంలో ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్-NSC. స్కీములో ఏడాదికి కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు. ప్రస్తుతానికి 7.7 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. మెచ్యూరిటీ సమయంలో వడ్డీ ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ విషయాన్నికాస్త గుర్తించుకోవాలి. ఆ మొత్తాన్ని నాలుగేళ్లలో మళ్లీ పెట్టుబడి పెడితే ట్యాక్స్ నుంచి మినహాయింపు.
ALSO READ: ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? ఫైల్ చేయకపోతే
వడ్డీపై వచ్చే ఆదాయానికి కూడా
సుకన్య సమృద్ధి యోజన-SSY. ఆడపిల్ల ఆర్థిక భద్రత కోసం కేంద్రం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఏడాదికి కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్-SCSS. రిటైర్మెంట్ సేవింగ్స్ పథకం. అధిక రిటర్నులతో పాటు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు. వడ్డీ రేటు కూడా పర్వాలేదు దాదాపు 8.2 శాతంగా ఉంది. రూ. 1,000 నుంచి రూ. 30 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.వడ్డీ ఆదాయానికి పన్ను వర్తిస్తుంది.
ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్-POTD. ఇందులో కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి అయితే లేదు. ఏడాదికి రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది షుమా. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది.