SRH VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ జరిగిన మ్యాచ్ హైదరాబాద్ టీం దారుణంగా ఓడిపోయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Sunrisers Hyderabad ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో గెలుస్తుంది అనుకున్న హైదరాబాద్ జట్టు… అత్యంత దారుణంగా ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ఏకంగా 7 వికెట్ల తేడాతో… దారుణ ఓటమి చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament ) వరుసగా నాలుగవ ఓటమి చవిచూసింది హైదరాబాద్ టీం. సన్రైజర్స్ హైదరాబాద్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే.. మూడు వికెట్లు నష్టపోయి ఫినిష్ చేసింది గుజరాత్ టైటాన్స్. దీంతో 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: Jofra Archer: అండర్టేకర్ లాగా నిద్ర లేచి..పంజాబ్ ను కూల్చేశాడు ?
బ్యాటింగ్ లో మరోసారి విఫలమైన హైదరాబాద్ ప్లేయర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. బ్యాటింగ్ విభాగంలో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 2024 సీజన్లో దుమ్ము లేపిన హైదరాబాద్ ప్లేయర్లు… ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో కూడా దారుణంగా ఓడిపోతున్నారు. ఇవాల్టి మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. చివరలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 9 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతో….. ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది హైదరాబాద్ టీం. ఇక హైదరాబాద్ టాపార్డర్ విషయానికి వస్తే… అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే 18 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. కాస్త టచ్ లోకి వచ్చినప్పటికీ… సిరాజ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి.. అవుట్ అయ్యాడు.
Also Read: Pakistan: పాకిస్థాన్ టీంలో ముసలం.. ఫ్యాన్స్, క్రికెటర్స్ దారుణంగా కొట్టుకున్నారు ?
అలాగే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్.. ఐదు బంతుల్లో 8 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 17 పరుగులు చేసి.. నిరాశపరిచాడు. నితీష్ కుమార్ రెడ్డి 34 బంతుల్లో 31 పరుగులు మాత్రమే చేసి… నిలబడలేకపోయాడు. క్లాసెన్ కాస్త టచ్ లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ 27 పరుగులు చేసిన తర్వాత సాయి కిషోర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కమిందు మెండిస్ ఒకే ఒక్క పరుగు చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఇలా 152 పరుగులకు… హైదరాబాద్ ఇన్నింగ్స్ క్లోజ్ అయింది.
పాయింట్స్ టేబుల్ లో హైదరాబాద్ స్థానం ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాయింట్స్ టేబుల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH Team ) చిట్టచివరన నిలిచింది. నాలుగు మ్యాచ్లాడిన హైదరాబాద్ టీం వరుసగా మూడు మ్యాచ్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్లో గెలవడంతో రెండు పాయింట్లు సాధించింది. దీంతో పదవ స్థానానికి పరిమితమైంది హైదరాబాద్. అటు గుజరాత్ టైటాన్స్ ( GT ) మూడవ స్థానానికి ఎగబాకింది.