HCU land dispute: 2020 లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోడ్డుపై కనిపించిన జింకలను కంచ గచ్చిబౌలి వ్యవహారానికి అంటగడుతున్నారని ప్రతిపక్షాలపై కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న గుంట నక్కల కుట్రలు బహిర్గతం అయ్యాయని ఫైరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫూయెన్సర్స్ కి ఈ వీడియోలపై నిజాలు మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు.
ALSO READ: NABARD Jobs: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.50 లక్షల జీతం భయ్యా.. నేడే లాస్ట్ డేట్..!
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ భూములకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలో కంచె గచ్చిబౌలి ప్రాంతాన్ని వదిలి ఓ జింక జనావాసాల్లోకి వెళ్లిన దృశ్యాలు కొన్ని వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ వీడియో వైరలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి ఆదివారం సోషల్ మీడియాలోన ఎక్స్ అకౌంట్ లో రియాక్ట్ అయ్యారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సదరు యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు అయిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో వారు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ వ్యవహారం నేషనల్ లెవెల్ లో వైరల్ అయ్యింది. ఈ భూముల వేలం వ్యవహారం నేపథ్యంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి.
అయితే 2003లో నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఈ భూములను అప్పటి ప్రభుత్వం ఐఏంజీ(IMG)కి కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. మరోవైపు ఈ భూములను ప్రభుత్వానికి కేటాయించడం.. మరో ప్రదేశంలోని భూములను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిని కంచ గచ్చిబౌలిలోని చెట్ల తొలగింపు ప్రక్రియను వెంటనే ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.