BigTV English

Federal Employees Trump court : మీ ఆదేశాలు చెల్లవు.. ట్రంప్ తలపై కోర్టు సుత్తి!

Federal Employees Trump court : మీ ఆదేశాలు చెల్లవు.. ట్రంప్ తలపై కోర్టు సుత్తి!

Federal Employees Trump court | అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధమైనవి అని అనేక యూనియన్లు, న్యాయవాద సంఘాలు కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేశాయి. ఈ పిటీషన్లపై తాజాగా యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్‌ జడ్జి విలియం అల్సప్‌ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో.. ట్రంప్‌ ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది.


డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ డోజ్‌ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇంతకు ముందే, ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ఇలా ఉండగా, ట్రంప్‌ నిర్ణయాల కారణంగా అనేక విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్‌ఎయిడ్‌లో ఉద్యోగుల తొలగింపు, మరికొన్ని నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.


Also Read: విలాసవంతమైన గాజా జీవనం.. ట్రంప్ వీడియోపై తీవ్ర వ్యతిరేకత!

దూకుడు నిర్ణయాలతో తగ్గిన ట్రంప్ క్రేజ్

ట్రంప్‌కు అమెరికాలో క్రేజ్‌ తగ్గుతోందా? తాజా పాపులర్‌ పోల్‌ సర్వే ఫలితాలు అవునని చెబుతున్నాయి. ఫిబ్రవరి 25న ముగిసిన రాయిటర్స్‌/ఇప్సోస్‌ పోల్‌లో ట్రంప్‌కు 44శాతం మద్దతు మాత్రమే ఉంది. జనవరి చివరి పోల్‌తో పోలిస్తే ఇది కొంత తగ్గింది. జనవరిలో 47శాతం మద్దతు ఉండగా, ఇప్పుడు 44శాతంకి పడిపోయింది. అదే సమయంలో, ట్రంప్‌ను వ్యతిరేకించేవారి సంఖ్య 10శాతం పెరిగి 51శాతంకి చేరుకుంది.

జనవరిలో ట్రంప్‌ ఆర్థిక విధానాలను కేవలం 43 శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా, ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ఇతర దేశాలపై ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు (టారిఫ్‌‌లు).. ఇతర ఆర్థిక విధానాలను బలపరిచే వారి సంఖ్య కేవలం 39 శాతం ఉంది. ట్రంప్‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తున్నారు. ఇదే గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఆయనకు అనుకూలంగా పనిచేసిన అంశం.

అయితే, అధ్యక్షుడిగా రెండో పర్యాయం మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్‌ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండడంపై చర్చ జరుగుతోంది. చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్‌ దిగుమతి సుంకాలు విధించడాన్ని 54 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ చైనాపై 10 శాతం దిగుమతి సుంకాలు విధింపు అంశంలో మాత్రం ట్రంప్‌ను సమర్థించే వారి సంఖ్య 49 శాతంగా ఉంది. అలాగే చైనాపై టారిఫ్‌లను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా 47 శాతం ఉండడం గమనార్హం. రాయిటర్స్‌, ఇప్సోస్‌ మీడియా సంస్థలు ట్రంప్ పాపులారిటీపై నిర్వహించిన తాజా పోల్‌లో మొత్తం 4145 మంది పాల్గొన్నారు.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×