Today Gold Rate: ఊహించినట్లుగానే బంగారం ధరలు లక్షకు చేరువైయింది. గత కొద్దిరోజుగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారానికి ఏకంగా రూ.700 పెరిగి రూ. 90,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.770 పెరిగి రూ.98,350 వద్ద కొనసాగుతోంది. పసిడి ధరలు పెరిగిన క్రమంలో దీనిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు మాత్రం.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న.. వారికి మాత్రం ఈ రేట్లు నిరాశను మిగిల్చాయి.
బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలహీనపడటం, డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం, అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం, ఫెడరల్ రిజర్వ్ తో వివాదం పలు అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో అమెరికా వేసిన అధిక సుంకాలపై చైనా ఫిర్యాదులు చేసింది. ఈ చర్య భవిష్యత్తులో దిగుమతి విధానాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికా చైనాతో సంప్రదింపులను ఆల్రెడీ మొదలుపెట్టింది. అయితే, ఈ చర్చల్లో ఇప్పటి వరకూ ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అందుకే, చైనా ఎగుమతి నిషేధాలు, పరస్పర చర్చల్లో ప్రారంభ దాడిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో లక్ష రూపాయలకు.. చేరుకునే అవకాశం ఉందని నిపుణులుఅంచనా వేస్తున్నారు. తాజాగా ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 350 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 350 వద్ద కొనసాగుతోంది
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 350 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,300ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 500 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96, 320 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,320 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఒక్క ఈఎంఐ లేటైతే ఏమవుతుంది..ఈ ఇబ్బందుల గురించి మీకు తెలుసా
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.