Dates Benefits: ఖర్జూరాలను ప్రకృతి ప్రసాదించిన అమృతం అని అంటారు. ఈ తియ్యటి పండు రుచికరమైనది మాత్రమే కాదు. మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసే అనేక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. చలికాలంలో ఖర్జూరాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే చలికాలంలో ఖర్జూరాన్ని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఖర్జూరంలో ఉండే మూలకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఖర్జూరాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల ఎముకలను బలంగా మారతాయి. అంతే కాకుండా చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :
తక్షణ శక్తిని అందిస్తుంది: ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. అథ్లెట్లు , శారీరక శ్రమ చేసే వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఖర్జూరాలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలను బలపరుస్తుంది: ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలోని పోషకాలు ఎముకలను ధృడంగా మార్చుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఖర్జూరంలో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని కూడా రక్షిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది: ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మాన్ని యవ్వనంగా , మెరిసేలా చేస్తుంది.
రక్తహీనతను నివారిస్తుంది: ఖర్జూరంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. రక్త హీనతతో ఇబ్బంది పడే వారు ఖర్జూరం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: ఖర్జూరంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
ఖర్జూరం తినడానికి మార్గాలు:
ఖర్జూరాలను పాలలో నానబెట్టడం: ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
షేక్: పాలు, అరటిపండు, ఇతర పండ్లతో ఖర్జూరాన్ని కలపి షేక్ చేసుకుని త్రాగవచ్చు.
స్వీట్లు: ఖర్జూరాన్ని స్వీట్ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.
Also Read: జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్
మధుమేహం ఉన్న వారు ఎందుకు ఖర్జూరాలు తినకూడదు ?
మధుమేహ రోగులు ఖర్జూరం తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
బరువు పెరగడం: మీరు బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరాలు తినడం తగ్గించాలి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.