Today Gold Rate: ఈ గోల్డ్ రేట్స్ ఏంటో ఒకచోట కుదురుగా ఉండవు. ఒకరోజు తగ్గినట్టే తగ్గి . మరిసటి రోజు మళ్లీ పెరుగుతాయి. దీనికి అనేక కారణాలు కావచ్చు. సోమవారం నాడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్ ఈరోజు(డిసెంబర్ 3) మళ్లీ పెరిగాయి. దేశీయంగా, ఇంటర్నేషనల్ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగినట్లే కనిపిస్తున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.400 వరకు పెరిగి రూ. 71,300 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 430 వరకు పెరిగి రూ.77,780 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం..
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు..
తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధరరూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 పలుకుతోంది.
వైజాగ్, గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.71,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,930 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 పలుకుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
వెండి ధరలు..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, గుంటూరులో కిలో వెండి ధర రూ.99,500 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.91,000 వద్ద ట్రేడింగ్ లో ఉంది.