Today Gold Rate: తులం రూ.90 వేలు దాటేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు.. అతి కొద్ది రోజుల్లోనే లక్ష దాటుతుందనడంలో డౌటే లేదు. పెరుగుతున్న గోల్డ్ రేట్స్‌తో పసిడి ప్రియులకు ముచ్చెమటలు పడుతున్నాయి. బంగారం పట్టాలంటే.. లక్ష కొట్టాల్సిందేనా అనేలా ఉంది పరిస్థితి. ఇక పెళ్ళిళ్ల సీజన్ స్టార్ట్ అవబోతోంది. ఇలాగే గోల్డ్ రేట్స్ కొనసాగితే ఏం చేయాలా అని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ కారణాలు చాలానే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవడంతో పాటు.. ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం, ఈక్విటీ మార్కెట్లు బలహీన పడటం వంటివి కూడా పసిడి ధరపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో బంగారం ధరను మరింత పెంచే అవకాశం లేకపోలేదు. అలాగనీ పసిడి ధర తగ్గదా.. అంటే ఏమో తగ్గొచ్చేమో..! ఏది ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారానికి ఏకంగా రూ.400పెరిగి, రూ.82,00 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.440 పెరిగి, రూ. 90,440 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,900కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,900 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 చేరుకుంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,900 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 వద్ద కొనసాగుతోంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.83,050కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,590 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర.82,900 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర.82,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 కి చేరుకుంది.
కేరళలో, కోల్ కత్తా, పుణె, ఇతర రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ధర.82,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 ఉంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.1,14,000 కి చేరుకుంది.
హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,14,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరులో, పుణెలో కిలో వెండి ధర రూ. 1,05,000 కి చేరుకుంది.