Betting Apps Promotion :బెట్టింగ్ భూతాన్ని ఇండియా నుండి పారద్రోలే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ పోలీసులు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఐఏఎస్ వీసీ సజ్జనార్ రంగంలోకి దిగి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అవ్వగా.. ఇప్పుడు మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రముఖ యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, అజయ్ సన్నీ, సన్నీ సుధీర్ నోటీసులు పంపించారు.
ఇదిలా ఉండగా మరొకవైపు హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ కి కూడా నోటీసులు పంపించగా వీరిద్దరూ దుబాయ్ కి పరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నోటీసులు పంపించిన ఈ సెలబ్రిటీలందరూ రేపు విచారణకు హాజరు కావాలని, పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు హీరోయిన్, హీరోలపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న సెలబ్రిటీస్..
ఇదిలా ఉండగా అటు సినిమాల ద్వారా ఇటు సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు తమకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత.. సినిమాల ద్వారా, షో ల ద్వారా వచ్చే డబ్బు చాలడం లేదని, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా ప్రజల డబ్బును పరోక్షంగా దోచుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ బెట్టింగ్ భూతానికి బానిసైన ఎంతోమంది అప్పులు చేసి మరీ ఇందులో డబ్బులు పెట్టి అప్పులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే హత్యలు ఎక్కువవుతున్న కారణంగా పోలీసులు రంగంలోకి దిగి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి భరతం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం 74 మందికి సంబంధించి, లిస్ట్ బయటకు తీయగా.. అందులో 11 మంది పై కేసు ఫైల్ చేయగా.. ఒకరిని అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు ఆరుగురికి నోటీసులు పంపించడం జరిగింది.మరో ఇద్దరికి నిన్ననే నోటీసులు పంపించినా.. వారు విచారణకు హాజరు కాలేదు. ముఖ్యంగా విష్ణు ప్రియ, టేస్టీ తేజాలకు నోటీసులు పంపించిన పోలీసులు.. విచారణకు రావాలని కోరగా.. వారి తరఫున శేఖర్ భాష పోలీస్ స్టేషన్ కి వెళ్లి, వారు విచారణకు రాలేరని, మీడియా కారణంగానే ప్రస్తుతం విచారణకు హాజరు కాలేరని రిక్వెస్ట్ చేశారు. ఇక శేఖర్ భాషా రిక్వెస్ట్ మేరకు పోలీసులు కూడా మరో నాలుగు రోజుల గడువును కేటాయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఆరుగురికి నోటీసులు ఇవ్వగా.. వీరికి కూడా నాలుగు రోజుల్లోపే విచారణకు రావాలని కోరారు..మరి దీనిపై ఈ సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక యూట్యూబర్స్ అయిన హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ లపై కూడా కేసు నమోదు అయింది. ఇటు హీరో హీరోయిన్లు కూడా ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసారు అనే విషయంపై పోలీసులు ప్రస్తుతం నిఘా పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, రాణా, నిధి అగర్వాల్ లాంటి వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి.
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలో మరో అరుగురికి నోటీసులు ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు
నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీ లకు నోటీసులు
దుబాయ్ కి పరారైన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ మరియు హర్ష సాయి
రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న… pic.twitter.com/ra4jf9bp1d
— BIG TV Breaking News (@bigtvtelugu) March 19, 2025