Today Gold Rate: పసిడి పరుగులు పెడుతుంది. పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆల్ టైమ్ రికార్డును టచ్ చేస్తుంది. బంగారం భగ్గుమంటే.. ధర నాలుగేళ్లలో నాలుగింతలు చేరుకుంది. కేవలం ఏడాదిలోనే 35 శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మరి పసిడి ఎంత వరకు పరుగులు పెట్టవచ్చు.. పండుగలు.. పెళ్లిళ్ల సీజన్ లలో సామాన్యుల సంగతి ఏంటి..?
పసిడి పరుగులు పెడుతోంది. దమ్ముంటే కొనండి అంటూ సవాల్ విసురుతోంది. మాంద్యం భయాలు వెంటాడుతున్న కూడా తగ్గేదేలా అంటూ పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గోల్డ్ అంటేనే సెంటిమెంట్.. సంస్కృతి సంప్రదాయాలకు ముడిపడి ఉన్న లోహం. పండుగలు, పబ్బాలు, శుభకార్యాలకు తప్పనిసరి. పసిడి ఎంత క్రేజ్ ఉందో దాని ధరలు కూడా అలాగే పరుగులు పెడుతున్నాయి.
ఇప్పుడు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం ఆకాశమార్గంలో పయనిస్తుంటే.. సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పెరుగుదల ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో రూ. లక్షకు చేరువవుతుందనడంలో అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి ఏకంగా రూ.650 పెరిగి రూ. 84,250 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.710 కి చేరుకుని 91,910 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,250 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,250 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910 చేరుకుంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,250 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910 వద్ద కొనసాగుతోంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,400కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,060 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,250 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,250 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,250 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910 కి చేరుకుంది.
కేరళలో, కోల్ కత్తా, పుణె, ఇతర నగరాల విషయానికి వస్తే.. ధర రూ.84,250 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,910 ఉంది.
Also Read: ఒక రూపాయికే 1 జీబీ డేటా..ఐపీఎల్, ఓటీటీ ప్రియులకు అదిరిపోయే ఆఫర్
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా తగ్గేదేలే అనేలా దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర రూ.1,13,000 కి చేరుకుంది.
హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,13,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరులో, పుణెలో కిలో వెండి ధర రూ. 1,04,000 కి చేరుకుంది.