Satyabhama Today Episode November 12 th : నిన్నటి ఎపిసోడ్ లో సత్య అందరికి టిఫిన్ పెడుతుంది.. క్రిష్, బాధ్యతల గురించి అందరికి తెలుసు అంటుంది.. ఇక సంజయ్ బిగ్ డాడ్ టెన్షన్ పడకండి నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను అని అంటాడు. సంజయ్ కూడా కొడుకు లాంటివాడే కదా.. కత్తి పోట్లు, ఫైటింగ్ గురించి చెప్పు అని సత్య కామెడీగా మాట్లాడుతుంది. నాకు క్రిష్ ను కాపాడుకొనే పని ఉండదు అని అంటుంది. దానికి మహాదేవయ్య సీరియస్ అవుతాడు. మధ్యలో జయమ్మ కలగ జేసుకోవడంతో సత్యకు సారీ చెబుతాడు. అంతలోనే ఒకడు వచ్చి నరసింహం డబ్బులు తీసుకున్నాడు. మనం చిన్న బాబును అక్కడకు పంపకపోవడమే మంచిదని అంటాడు. దానికి సీరియస్ అయిన చిన్నా తన అనుచరుడికి వార్నింగ్ ఇస్తాడు. డబ్బుల కోసం వెళ్తున్న క్రిష్ ను ఆపి తనకు ఐదు కోట్లు ఇస్తానని చక్రవర్తి చెబుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్య, చక్రవర్తి మాట్లాడుతుంటే సత్య అక్కడికి వెళ్తుంది. చక్రవర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎప్పుడూ లేనిది మనిషిని కాపాలా పెట్టుకొని మాట్లాడుతున్నారు. అంతగా దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దానికి మహాదేవయ్య నీకు అనవసరం అంటాడు. ఎదో జరుగుతుంది అని అంటాడు. కానీ మహాదేవయ్య మా అన్నదమ్ముల మధ్య సవాలక్ష ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా అని అడుగుతాడు. మా ఇద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. నీకు చెబితే తీరుస్తావా? ఆరుస్తావా అని అడుగుతాడు. దానికి సత్య ఇప్పుడు డబ్బులు వచ్చాయి. నేను ఎమ్మెల్యే అయ్యాక కూడా చిన్నా గాడు నా ఇంటికి కాపాలాగా ఉంటాడు. ఉండేలా చేస్తాను అని అంటాడు. అది చూద్దాం అని సత్యం అంటుంది. ఇక క్రిష్ ను ఆపడం నాకు కష్టమే కానీ క్రిష్ పుట్టుక గురించి తెలుసుకుంటాను.. ఎక్కడ మొదలైందో అక్కడే తెలుసుకుంటాను అని అంటాడు. అది నీ వల్ల కాదు అంటాడు మహాదేవయ్య.. నేను తెలుసుకొని చూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది.
మైత్రి ప్రయాణంకోసం అంతా సిద్ధం చేస్తారు. నందిని, హర్ష ఇద్దరు మైత్రిని ఫ్లైట్ ఎక్కించాలని వెళ్తారు. అయితే మైత్రి వీరిద్దరి నుంచి ఎలా తప్పించుకోవాలా అని అనుకుంటుంది. అమ్మవారి గుడి దగ్గర ఆపమని అడగ్గా మైత్రి ని ఎవరో తీసుకెళ్తారు.. ఇక నందిని, హర్ష టెన్షన్ పడుతూ వెతుకుతారు.. ఇక మైత్రి వెళ్లిపోగానే ఇళ్లంతా బోసిపోయిందని శాంతమ్మ ఇంట్లో వాళ్లతో అంటుంది. దానికి సంధ్య వెనక్కి రమ్మంటావా అని అంటే దానికి శాంతమ్మ వద్దమ్మ మీ వదిన నన్ను చంపేస్తుందని అంటుంది. ఎక్కడున్నా మైత్రి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఇంతలో హర్ష, నందిని వస్తారు. మైత్రిని ఎవరో కిడ్నాప్ చేశారని హర్ష జరిగింది చెప్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తే హర్ష ఇవ్వడం లేదని నందిని ఫైర్ అవుతుంది. అప్పులు చేసి టికెట్ కొనడం ఇవన్నీ వేస్టేనా ముందు కంప్లైంట్ ఇవ్వు మైత్రి దొరికితే ఫారిన్ పంపాలని అంటుంది. లేదంటే మా చిన్న అన్నకు చెబుతాను వెంటనే తీసుకొని వస్తాడు అంటుంది. కానీ హర్ష అందుకు ఒప్పుకోడు. కిడ్నాపర్లు ఫోన్ చేస్తారు అప్పుడు మాకు తెలియదు అని చెప్పండి అని నందిని అంటుంది. కానీ హర్ష మైత్రి కనిపించలేదు అని టెన్షన్ పడుతుంటే ఇలా మాట్లాడుతావేంటి అని అంటాడు..
మైత్రి తన ఫ్రెండ్ శృతితో కలిసి మాట్లాడుతుంది. కిడ్నాపర్లకి తాను చెప్పే వరకు పని లేదు అని చెప్పి బిర్యాని తినుకోమని అంటుంది. ఫ్లైట్ టేకాప్ అయిన వరకు ఫోన్ చేయించనని అంటుంది. మరోవైపు చక్రవర్తి ఇంటికి వెళ్తానని చెప్తే జయమ్మ ఏడుస్తుంది. ఈ అమ్మ ఊపిరితో ఉన్నంతవరకు మాట్లాడు అని అంటుంది. ఏం చేయనురా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నావ్ చుట్టంలా చూస్తున్నావ్ నేను నీకు అమ్మనిరా. నా మనసుకి నీ అవసరం ఉందిరా మీరు ప్రేమగా మాట్లాడే మాటలు కోసం ముఖం వాచి ఉన్నానురా అంత కంటే ఈ ముసలి తల్లి ఏం ఆశించడం లేదని అంటుంది. ఇక చక్రవర్తి కొడుకు ఎంత పెద్ద వాడు అయినా అమ్మ అమ్మే అమ్మ. నీతో మాట్లాడకూడదు అని కాదు అమ్మ నీతో మాట్లాడితే నా కన్నీళ్లు చెప్పుకోకుండా ఉండలేను. చెప్పి నీకు బాధ పెట్టాలి అని లేదమ్మా నీ చుట్టూ ఇంత మంది ఉన్నారు కానీ నేను ఒంటరి వాడినమ్మా నా జీవితం ఒంటరిది అయిపోయింది. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే అప్పుడప్పుడు వస్తున్నా అని అంటాడు.క్రిష్ సత్య రావడంతో చక్రవర్తి పుట్టినరోజు అని చెప్తాడు. దాంతో సత్య అన్నీ క్రిష్కి చూసుకోమని అంటుంది. మరోవైపు రాత్రి అయినా ఇంకా కిడ్నాపర్లు నుంచి ఫోన్ రాలేదని అందరూ కంగారు పడతారు. ఇక మైత్రి ఫ్రెండ్ ఇప్పటికే లేటు అయింది ఫోన్ చేయించు అని అంటుంది.. ఇక మైత్రి రౌడీలతో ఫోన్ చేయిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..