No UPI Day: దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వ్యాపారులు తలపెట్టిన నో యూపీఐ డే నిరసనను ట్రేడర్లు-బిజినెస్ అసోసియేషన్లు విరమించుకున్నాయి. ఇంతకీ కేంద్రం ఆర్థికమంత్రి సీతారామన్‌తో భేటీలో వ్యాపార వర్గాలకు ఎలాంటి హామీ వచ్చింది? ఉన్నట్లుండి వ్యాపారులు వెనక్కి తగ్గడానికి కారణాలు ఏంటి? న్యాయస్థానం తీర్పు నేపథ్యమే ఇందుకు కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
UPI పేమెంట్స్‌పై మర్చంట్ డిస్కౌంట్ రేట్-MDR విధించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యారు ట్రేడర్లు. అక్టోబర్ 2న అనగా శుక్రవారం ‘నో యూపీఐ డే’ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని ట్రేడర్స్-బిజినెస్ అసోసియేషన్లు డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 20 మంది సీనియర్ వాణిజ్య, రిటైల్ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ క్రమంలో ట్రేడర్లు శుక్రవారం తమ నిరసనను విరమించుకున్నారు.
ట్రేడర్లు లేవనెత్తిన పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించారట కేంద్ర ఆర్థికమంత్రి. ఫలితంగా అక్టోబర్ 2 నిరసనను రద్దు చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. మంత్రితో జరిగిన భేటీలో వర్తక సంఘాల ప్రతినిధులు రెండు కీలక డిమాండ్లను పెట్టారు. రాబోయే పండుగ సీజన్, పెరిగిన వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత MDR ను వాయిదా వేయాలని కోరాయి. డిజిటల్ పేమెంట్స్‌పై జీరో ఛార్జెస్ పరిమితిని లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కోరినట్టు తెలుస్తోంది.
వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలను పరిధి నుంచి పూర్తిగా మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ట్రేడర్లు లేవనెత్తిన సమస్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా చిన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ సానుకూల స్పందనతో ట్రేడర్ల సంఘాలు వెనక్కి తగ్గాయి.
ALSO READ: పండగ సీజన్ వేళ సామాన్యుడికి షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. ఏకంగా రూ. 62.50 పెంపు