Gas Cylinders Prise Hike: పండగ సీజన్ వేళ సామాన్యుడికి షాక్ తగలింది. అక్టోబర్ నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం విజృంభించింది. ఫలితంగా నేటి నుంచి గ్యాస్ సిలిండర్లపై బాడుదు మొదలైంది. ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను పెంచాయి. పెంచిన ధర రాత్రి నుంచి అమల్లోకి రానుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలను యథాతథంగా ఉంచింది.
దేశవ్యాప్తంగా పండుగ సీజన్ సమీపించిన తరుణంలో వ్యాపారులకు బ్యాడ్ న్యూస్. అక్టోబర్ ఒకటి నుంచి అనగా గురువారం నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూనే, కోట్లాది గృహిణులకు ఉపశమనం కలిగించింది. ఇళ్లలో వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. పాత ధరలను కంటిన్యూ చేసింది.
వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్ యజమానుల ఖర్చులు పెరుగుతాయి. తత్ఫలితంగా టీ- స్నాక్స్ ధరలను పెంచే అవకాశముంది. అలాగే వివాహాలకు క్యాటరింగ్ కూడా ఖరీదుగా మారవచ్చు. ఢిల్లీలో రూ.62.50 పెరిగి ధర రూ. 2810లకు చేరింది వాణిజ్య గ్యాస్ సిలిండర్. ముంబైలో రూ.63.50 పెరిగి ధర రూ. 2764కు చేరింది. చెన్నైలో రూ. 66. 50 పెరిగి 2983 కి చేరింది. కోల్‌కత్తా, పాట్నా నగరాల్లో రూ. 70 పెరిగి.. 2954కు చేరింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,996కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా రూ. 69 మేరా పెరిగి రూ. 3,001కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. వాణిజ్య సిలిండర్ల ధర రూ.71.50 వరకు పెరిగింది. కొన్ని నగరాల్లో సిలిండర్ ధర రూ.60 కాగా, మరికొన్నింటిలో రూ. 66 ఇలా స్థానిక పన్నుల బట్టి పెరుగుతూ వచ్చింది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల మాదిరిగా కాకుండా 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో దేశీయ సిలిండర్ ధర రూ.942, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50 ఉంది.
ALSO READ: వాట్సాప్ మెసేజ్‌లు ఇక ఉచితం కాదు.. అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే
అక్టోబర్ ఒకటి నుంచి రాయితీ ధరలకు ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడానికి వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇ-కేవైసి ఉన్నవారికి రాయితీ లభిస్తుంది. బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయనివారు రాయితీ ధరతో గ్యాస్ బుక్ చేసుకోలేరు. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేదా బుకింగ్‌లు నిలిపివేయబడవు. వినియోగదారులు తమ ఇ-కేవైసిని పూర్తి చేసిన తర్వాత వారు రాయితీ ధరతో సిలిండర్లను తిరిగి పొందడం జరుగుతుంది.