Stock Market Crash : బ్లాక్ మండే. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్. కనీవినీ ఎరుగని పతనం. రికార్డు స్థాయిలో లాస్. ట్రంప్ టారిఫ్ దెబ్బ.. సునామీలా విరుచుకుపడింది. కుబేరుల సంపదంతా ఆవిరైపోయింది. సామాన్యుల సొమ్మంతా హుష్ కాకిలా ఎగిరిపోయింది. చూస్తుండగానే లక్షల కోట్లు ఫసక్. వాణిజ్య యుద్ధ భయం ఇండియన్ మార్కెట్లను కుదిపేసింది. ఆర్థిక మాంద్యం హెచ్చరికలు ప్రకంపణలు సృష్టించాయి. నిఫ్టీ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కాస్త కోలుకుని 742 పాయింట్ల లాస్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో 3 శాతానికి పైగా నష్టం. సెన్సెక్స్ 2,226 పాయింట్ల నష్టంతో నేలచూపులు చూసింది. BSEలోనే దాదాపు 14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మార్కెట్లో అనిశ్చితిని తెలిపే.. ఇండియా విక్స్ ఏకంగా 66 శాతానికి పెరిగింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఇలా అన్ని రకాల షేర్లు పతనమయ్యాయి. మెటల్, రియాలిటీ స్టాక్స్ బాగా నష్టపోయాయి.
అంబానీ, అదానీలకు బిగ్ లాస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఇవాళ ఒక్కరోజులోనే షేర్ వాల్యూ 7.4 శాతం క్షీణించింది. వారం రోజుల ట్రేడింగ్ లాసెస్‌తో రిలయన్స్ మార్కెట్ విలువ 2 లక్షల కోట్లు పతనమైంది. అంబానీ వ్యక్తిగత సంపద సుమారు 30వేల కోట్లు తగ్గింది. ప్రస్తుతం రూ.1,115 దగ్గర ట్రేడ్ అవుతోంది. అదానీ గ్రూపు షఏర్లు సైతం భారీగా నష్టపోయాయి. గౌతమ్ అదానీ నికర సంపదలో 25వేల కోట్ల నష్టం ఏర్పడింది. జిందాల్ గ్రూపు యాజమాన్యానికి 18 వేల కోట్లు లాస్.
ట్రంప్ దెబ్బ.. టాటా మోటార్స్ అబ్బా..
ట్రంప్ దెబ్బ టాటా మోటార్స్‌కు గట్టిగా తగిలింది. ఆటోమొబైల్ దిగుమతులపై 25శాతం టారిఫ్ అని ట్రంప్ ప్రకటించగానే.. అమెరికాకు ల్యాండ్ రోవార్, జాగ్వార్ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపేసింది టాటా మోటార్స్. ఇక ఖతం. ఈ న్యూస్‌తో సోమవారం ఇంట్రాడేలో షేర్ వాల్యూ 10శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. టాటా గ్రూపునకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ ఏకంగా 19శాతం డౌన్ ఫాల్ అయింది. టీసీఎస్, టాటా స్టీల్, టైటాన్, టాటా కన్జూమర్స్ అన్నీ పతనమయ్యాయి. 1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది టాటా కంపెనీ.
అన్ని షేర్లు ఫసక్..
అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, డాబర్ ఇండియా తదితర షేర్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఏకంగా 517 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయంటే మార్కెట్లు ఎంత దారుణంగా పడిపోయాయో తెలుస్తోంది.
Also Read : చరిత్రలో టాప్ 5 పతనాలు.. ఎప్పుడెప్పుడు అంటే..
క్రొకడైల్ ఫెస్టివల్
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచీ ఇదే దుస్థితి. ఇండియన్ స్టాక్ మార్కెట్లలోనే ఇప్పటి వరకు సుమారు 45 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూ కరిగిపోయింది. సోమవారం ఒక్కరోజే 20 లక్షల కోట్ల సంపద ఖతం. ముందుముందు ఇంకెంత పతనం చూడాల్సి వస్తుందో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. బ్లాక్ మండేతో మనోళ్లు మటాష్ అన్నారు. మరి, మంగళవారం?