BigTV English

Coconut water: నిండుగా నీళ్లున్న కొబ్బరి బోండాం కావాలా? సింఫుల్ గా ఇలా సెలక్ట్ చేసుకోండి!

Coconut water: నిండుగా నీళ్లున్న కొబ్బరి బోండాం కావాలా? సింఫుల్ గా ఇలా సెలక్ట్ చేసుకోండి!

వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా కొబ్బరి బోండాలు దర్శనం ఇస్తాయి. హానికరమైన కూల్ డ్రింక్స్ తాడగానికి బదులుగా కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, రీఫ్రెషింగ్ అనుభూతి కలుగుతుంది. కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్ నుంచి కాపాడ్డంలో కీలకపాత్ర పోషిస్తాయి. జీవక్రియ మెరుగు పరచడంలో సాయపడుతాయి. బరువును కంట్రోల్ చేస్తాయి. కొబ్బరి నీళ్లలోని కాల్షియం, మెగ్నీషియం, ఎముకలను బలోపేతం చేస్తాయి. కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడ్డంలో సాయపడుతాయి. ఇన్ని సుగుణాలున్న కొబ్బరి నీళ్లు సమ్మర్ లో విరివిగా లభిస్తాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా కొబ్బరి బోండాలే దర్శనం ఇస్తుంటాయి.


నిండుగా నీళ్లున్న కొబ్బరి బోండాలను ఎలా గుర్తించాలి?

కొన్నిసార్లు కొబ్బరి బోండాంలో కొన్నే నీళ్లు ఉంటాయి. ఎంతో ఇష్టంగా తాగాలి అనుకున్న వాళ్లకు నిరాశ కలుగుతుంది. ఎక్కువ నీళ్లు ఉన్న కొబ్బరి బోండాలను ఎలా గుర్తించాలి? ఏ టిప్స్ ఫాలో కావాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ బోండాంను ఊపండి

వాటర్ ఎక్కువగా ఉన్న బోండాంను గుర్తించే ఫస్ట్ టిప్.. బోండాంను చేతిలోకి తీసుకుని ఊపాలి. కొబ్బరి బోండాంలో నీళ్ల శబ్దం వినిపిస్తే, అందులో నీళ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. నిండుగా నీళ్లు ఉంటే సాధారణంగా సౌండ్ వినిపించదు. సో, ఇకపై కొబ్బరి బోండాం తాగడానికి వెళ్లినప్పుడు బోండాంను ఊపి చూడండి.

⦿ గుండ్రంగా ఉండాలి

కొబ్బరి బోండాం పొడవుగా ఉండకూడదు. గుండ్రంగా ఉండే బోండాంను తీసుకోవాలి. గుండ్రంగా పెద్దగా ఉన్న బోండాంలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కేరళ, బెంగళూరు నుంచి వచ్చే బోండాలన్నీ గుండ్రంగానే ఉంటాయి. అందులో ఎక్కువగా నీళ్లు ఉంటాయి. అందుకే, సాధారణ బోండాలతో పోల్చితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

 ⦿ ఆకుపచ్చ రంగులో ఉండాలి

పూర్తి ఆకుపచ్చ రంగులో ఉన్న కొబ్బరి బోండాంలో ఎక్కువగా నీళ్లు ఉంటాయి. కొబ్బరి బోండాం మీద ముధురు గోధుమ రంగు మచ్చలు ఉంటే వాటిలో వాటిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. కాస్త ఎండినట్లుగా ఉన్న బోండాంను కాకుండా తాజా బోండాంను తీసుకోవాలి. అలాంటి వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బోండాం మీద గోధుమ రంగు మచ్చలు ఉంటే నీటికి బదులుగా కొబ్బరి ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి.

Read Also: మనిషిలా మాట్లాడే కాకి.. నెట్టింట వీడియో వైరల్..

⦿ అక్కడే తాగడం మంచిది

కొబ్బరి బోండాం నీళ్లను వెంటనే తాగడం మంచిది. షాపు అతడు బోండాం కొట్టి ఇవ్వగానే తాగితే పూర్తి స్థాయిలో పోషకాలు అందుతాయి. అలా కాదని, కొబ్బరి నీళ్లను బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్లి, వాటిని ఫ్రిజ్ లో పెట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి లాభం కలగకపోగా, నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ, కొబ్బరి నీళ్లలోని పోషకాలు తగ్గుతాయి. తియ్యగా ఉన్న కొబ్బరి నీళ్లతో పోల్చితే వగరుగా, చప్పగా ఉన్న బోండాం నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించాలి.

Read Also: వీధి కుక్కలు ఉండాలి.. లేకపోతే ఎన్ని నష్టాలో చూడండి – తాజా స్డడీలో షాకింగ్ విషయాలు!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×