Trump World Center: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఆయన చూపు భారతదేశంపై పడింది. తాజాగా దేశంలో తొలిసారి ట్రంప్ బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును పూణెలో ప్రారంభించాలని నిర్ణయించింది. ట్రిబెకా డెవలపర్స్-కుందన్ స్పేసెస్ సహకారంతో ఈ ప్రాజెక్టు చేస్తోంది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కి దేశంలో ఫస్ట్ బిజినెస్ ఆఫీసు ప్రాజెక్టు ఇదే.
ట్రంప్ వరల్డ్ సెంటర్ ఎక్కడ?
ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న సెంటర్ ఏ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు? అన్నది అసలు పాయింట్. కొత్త ప్రాజెక్టుకు ట్రంప్ వరల్డ్ సెంటర్ అని పేరు పెట్టారు. మహారాష్ట్రలోని పూణె సిటీలో కోరెగావ్ పార్క్ ఏరియాలో నిర్మించనుంది. దాదాపు నాలుగున్న ఏకరాల్లో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనుంది. కోరెగావ్ ప్రాంతం రియల్ ఎస్టేట్ విలువలు కలిగినదిగా పేరు పొందింది. కొన్నాళ్లుగా పూణె ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల ఆఫీసులు అక్కడ ఉన్నాయి. సరిగ్గా ఆ ప్రాంతంలో ట్రంప్ వరల్డ్ సెంటర్ ను నిర్మించనున్నారు. ఈ లెక్కన ప్రాంతంలో భూముల ధరలు అమాంతంగా పెరగనున్నాయి.
ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
ట్రంప్ బ్రాండెడ్ వాణిజ్య ప్రాజెక్టు టార్గెట్ పెద్దదే. దాదాపు $289 మిలియన్ విలువైన అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది ట్రంప్ ఆర్గనైజేషన్. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించనుంది. అందులో 27 అంతస్తులు ఉంటాయి. పూణెలో బిజినెస్ పరిసరాలలో ఉన్న విస్తృతమైన ఆఫీస్ అవసరాలను తీర్చేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనుంది. అయితే పెట్టుబడి కూడా భారీగా పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇన్వెస్ట్‌మెంట్ మాటేంటి?
ట్రంప్ వరల్డ్ సెంటర్ ప్రాజెక్టుకు రూ. 1,700 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. రూ. 2500 కోట్లుగా రావచ్చని డెవలర్స్ ఓ అంచనా మాత్రమే. ట్రంప్ వరల్డ్ సెంటర్ ప్రాజెక్టు దాదాపు నాలుగేళ్లలో పూర్తి కానుందని చెబుతున్నారు ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా. ఇదే ప్రాజెక్టు కాకుండా ట్రిబెకా డెవలపర్స్ దేశంలోని నార్త్-సౌత్ ప్రాంతాల్లో మూడు లేదా నాలుగు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రూ. 6000 కోట్ల నుంచి రూ. 7000 కోట్ల మధ్య పెట్టుబడులతో ఉంటాయన్నది మహతా మాట.
ALSO READ: పోస్టాఫీసులో ఒకేసారి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే..
ట్రంప్ ఆర్గనైజేషన్ దశాబ్దాలుగా భారత్‌లో తన మార్కెట్‌కి పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కాకపోతే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. అమెరికా బయట ట్రంప్ బ్రాండ్‌కి భారత్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా నిలిచింది. ట్రిబెకా డెవలపర్స్ దేశంలోని నాలుగు సిటీల్లో లగ్జరీ నివాస ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పుడు ట్రంప్ బ్రాండ్‌తో పూణెలో వాణిజ్య ప్రాజెక్టు ప్రారంభం అవడం ఇదే తొలిసారని అంటున్నారు.
మరి హైదరాబాద్ ప్రాజెక్టు ఏంటి?
అన్నట్లు హైదరాబాద్ లో ట్రంప్ ఆర్గనైజేషన్ అడుగుపెట్టనుంది. మాదాపూర్ లోని ఖానాపూర్ ప్రాంతంలో రెండేళ్ల కిందట ఓ నిర్మాణ సంస్థ మూడు ఎకరాలను కొనుగోలు చేసింది. స్థానిక మంజీరా గ్రూప్ తో కలిసి ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ టవర్‌ని నిర్మించనుంది. ఈ టవర్ శంకుస్థాపనకు జూనియర్ ట్రంప్ కొద్దిరోజుల్లో ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.